వయసుకు తగిన బరువు, ఎత్తు లోపం తో ఉన్న పిల్లలకు సరైన వైద్య చికిత్సలతో పాటు పౌష్టికాహారం అందించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిపై సీడీపీఓలు, సూపర్ వైజర్ లతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, బరువు, ఎత్తు లోపం తో ఉన్న పిల్లలకు, రక్త హీనతతో బాధ పడుతున్న బాలింతలకు, గర్భిణీలకు అనుబంధ పోషకాహారం అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాల వారిగా పోషకాహార దినోత్సవాలు నిర్వహించి, అవగాహన కార్యక్రమాలు ఆయా గ్రామాల సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శుల సహకారంతో సంక్షేమ శాఖ సూపర్ వైజర్లు, సీడీపీఓ లు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలని అన్నారు. తీవ్ర, అతి తీవ్ర పౌష్టికాహార లోపం కలిగిన పిల్లలకు పర్యవేక్షణతో కూడిన అనుబంధ పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో జిల్లాలో ఇప్పటి వరకు 14 మండల కేంద్రాలలో సర్పంచ్ లు, పంచాయితీ కార్యదర్శులు, ఆశాలు, ANM, అంగన్వాడీలకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని, రానున్న రోజుల్లో మిగితా అన్ని మండలాల్లో ఈ కార్యక్రమాలను నిర్వహించాలని అన్నారు. అతి తీవ్ర లోపం కలిగిన పిల్లలకు, రక్తహీనతతో బాధ పడుతున్న వారికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లు, RBSK బృందాలు, సూపర్ వైజర్, సీడీపీఓల సమన్వయంతో ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్సలు అందించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పౌర సరఫరాల శాఖ ద్వారా నిర్దేశించిన సమయంలోగా సరుకులు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల వారీగా బియ్యం, గుడ్లు, పాలు, తదితర వాటి నిలువలు, ఖర్చుల వివరాలను పక్కాగా రిజిస్టర్ లో నమోదు చేయాలనీ సూచించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, పౌష్టికాహార లోపం గల పిల్లలకు అంగన్వాడీలలో బాలామృతం అందించాలని అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలలోని అంగన్వాడీ కేంద్రాల వారిగా టీచర్ లకు, తల్లిదండ్రులకు పౌష్టికాహారం అందించేలా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. అంతకుముందు జిల్లాలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ద్వారా అమలవుతున్న పథకాలు, కార్యక్రమాల పురోగతిపై పవర్ పాయింట్ ప్రసెంటేషన్ ద్వారా జిల్లా సంక్షేమ అధికారి మిల్కా వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి సుదర్శన్, మైనారిటీ సంక్షేమ శాఖ అధికారిణి కృష్ణవేణి, సీడీపీఓలు, సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB-వయసుకు తగిన బరువు, ఎత్తు లోపం తో ఉన్న పిల్లలకు సరైన వైద్య చికిత్సలతో పాటు పౌష్టికాహారం అందించాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
ITDA UTNOOR: గిరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.
-
DPROADB- ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB- అకస్మాత్తుగా కుప్పకూలి పోయి మరణాలు సంభవించకుండా సి.పి.ఆర్. సేవలు అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.పి.ఎస్.
-
DPRO ADB: పట్టణ ప్రజలు తమ ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.