DPRO ADB-విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలి- స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.

విద్యార్థులు కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం పట్టణంలోని షెడ్యూల్డు కులాల బాలికల వసతి గృహంలో జిల్లా షెడ్యూల్డు కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో విద్యార్థులకు పదవతరగతి పరీక్షలపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి జ్ఞాన సరస్వతి, డా.బి.ఆర్.అంబెడ్కర్, జ్యోతిబా పూలె చిత్రపటాలకు పూలమాలలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యాశాఖ సహకారంతో ప్రేరణ సదస్సు ద్వారా ఉపాధ్యాయులు పదవతరగతి పరీక్షలపై గణితం, ఇంగ్లీష్, సైన్స్, తదితర సబ్జెక్టులలో విద్యార్థుల సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు సబ్జెక్టుల వారిగా సందేహాలను నివృత్తి చేసుకొని పదవతరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలు సాధించాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన బోధనతో పాటు ఉచితంగా పుస్తకాలు, భోజనం, దుస్తులు, తదితర సౌకర్యాలు కల్పించడం జరుగుతుందన్నారు. సబ్జెక్టుల వారిగా నిపుణులైన ఉపాధ్యాయులచే పరీక్షల పై మోడల్ పేపర్లు తయారుచేసి, ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి విద్యార్థులందరూ ఉత్తీర్ణత సాధించాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు ప్యాడ్,పెన్,స్కెల్, ఆల్ ఇన్ వన్ బుక్ లను పంపిణి చేసారు. అంతకు ముందు వసతి గృహంలో మౌళిక సదుపాయాల కల్పన కు చేపడుతున్న పనులను అదనపు కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా షెడ్యూల్డు కులాలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖల అధికారులు సునీత, రాజలింగు, వసతి గృహాల వార్డెన్లు, అధికారులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post