DPRO ADB- విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం సాయంత్రం తలమడుగు మండలం ఖోడత్, తలమడుగు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో యువజన క్రీడాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ఆమె సందర్శించారు. ముందుగా విద్యార్థులతో కలిసి కాసేపు బ్యాట్మెంటన్ ఆడారు. అనంతరం వేరువేరుగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొని కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. విద్యార్థులలో క్రీడా నైపుణ్యాలను పెంపొందించేందుకు జిల్లాలో 14 వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను ప్రారంభించడం జరిగిందన్నారు. పట్టణ కేంద్రంలో నాలుగు, గ్రామీణ ప్రాంతాలలో పది ఏర్పాటు చేశామని, తలమడుగులో వాలీబాల్, కుచులాపూర్ లో హాకీ, ఖోడత్ లో బ్యాట్మెంటన్ మూడు శిబిరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. విద్యార్థులు క్రీడా నైపుణ్యాలను పెంపొందించుకుని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలని సూచించారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 237 ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, కిచెన్ షెడ్, పహరి గోడ, మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. తలమడుగు జడ్పిటిసి సభ్యులు గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ, విద్యార్థులు వేసవి సెలవులలో నిర్వహించే క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగం తీసుకోవాలని అన్నారు. తలమడుగు మండలంలో మూడు క్రీడా శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేసినందుకు జిల్లా కలెక్టర్ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేశ్వర్లు, గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, సర్పంచ్ లు కరుణాకర్ రెడ్డి, ఆనంద్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాకతీయ విద్యాలయం లో నిర్వహిస్తున్న వేసవి క్రీడా శిక్షణ శిబిరం ను జిల్లా కలెక్టర్ సందర్శించారు. విద్యార్థులు చేసిన కరాటే విన్యాసాలను తిలకించారు. అనంతరం విద్యార్థులకు క్రీడా పరికరాలతో పాటు ప్రశంస పత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post