DPRO ADB- విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక, కళా రంగాలలో రాణించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

విద్యార్థులు చదువుతోపాటు సాంస్కృతిక, కళా రంగాలలో రాణించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని తన ఛాంబర్ లో రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు ఆమె ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులు కళారంగాలలోనూ గుర్తింపు తెచ్చుకోవాలని అన్నారు. మే 31న రవీంద్ర భారతీ, హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సాంస్కృతిక పోటీలలో జిల్లా నుండి 30 మంది బి.సి వసతి గృహ బాలబాలికలు పాల్గొనడం అభినందనీయమన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ కార్యక్రమాలలో, సాంస్కృతిక ప్రదర్శనలలో పాల్గొనాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి కె. రాజలింగు, వసతి గృహ సంక్షేమాధికారులు సుజాత, సంధ్య, జావీద్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post