విద్యుత్ వినియోగదారుల సమస్యలను విద్యుత్ నియంత్రణ మండలి నిబంధనల మేరకు పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ డైరెక్టర్లు గణపతి, మోహన్ రెడ్డి లు అన్నారు. బుధవారము జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారానికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఆధ్వర్యం లో ముఖాముఖీ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విద్యుత్ సమస్యల పై 54 దరఖాస్తులు రావడం జరిగిందని తెలిపారు. నిబంధనల మేరకు దశల వారిగా సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. ఈ ముఖాముఖీ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ ఈ ఉత్తమ్ జాడే, విద్యుత్ శాఖ ఇంజినీర్లు, అధికారులు, వినియోగదారులు, తదితరులు పాల్గొన్నారు.