DPRO ADB -వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలను వెబ్ కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించారు. జిల్లాలోని 8 పోలింగ్ కేంద్రాలలో 91.78 శాతం ఓట్లు పొలయ్యాయని కలెక్టర్ తెలిపారు. ఆదిలాబాద్ లో 88.95 శాతం, ఉట్నూర్ లో 97.62, మంచిర్యాలలో 82.21, బెల్లంపల్లిలో 86.36, నిర్మల్ లో 100, బైంసా లో 97.06, ఆసిఫాబాద్ లో 97.10, కాగజ్ నగర్ లో 97.92 శాతం ఓట్లు పోలయ్యాయని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించినందుకు యంత్రాంగానికి కలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ వెబ్ కాస్టింగ్ పరిశీలన లో ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్, అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, ఆర్డీఓ రాజేశ్వర్, కలెక్టరేట్ పరిపాలనాధికారిణి వర్ణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, తహసీల్దార్లు అతికొద్దిన్, పర్యవేక్షకులు రాజేశ్వర్, సాంకేతిక సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

Share This Post