DPRO ADB-శాసన మండలి ఎన్నికలు ప్రశాంతంగా జరుగుచున్నాయి- ఎన్నికల ప్రధాన అధికారి డా. శశాంక్ గోయల్.

రాష్ట్రం లోని ఐదు స్థానిక సంస్థల శాసన మండలి స్థానాలకు ఈ రోజు పొలింగ్ నిర్వహించడం జరుగుచున్నదని, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ అన్నారు. శుక్రవారం రోజున రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల పరిశీలకులు నవీన్ మిట్టల్, జిల్లా కలెక్టర్, ఎస్పీ లు జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో పోలింగ్ సరళి ని పరిశీలించారు. పొలింగ్ కేంద్రం ముందు భాగంలో ఏర్పాటు చేసిన మెడికల్ డెస్క్, సెల్ పాయింట్ లను పరిశీలించారు. ఈ సందర్బంగా సీఈఓ మాట్లాడుతూ, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో ఈ రోజు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుచున్నదని తెలిపారు. ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని, సిబ్బందికి కావలసిన ఏర్పాట్లు అన్ని సమకూర్చడం జరిగిందని, కోవిడ్ నిబంధనల ప్రకారం పొలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటె అధికారుల దృష్టికి తీసుకరావాలని వాటిని పరిశీలించి పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ రాజేష్ చంద్ర, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post