DPRO ADB- శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగపరచుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం రోజున స్థానిక టీటీడీసీ సమావేశ మందిరంలో రెవెన్యూ, పంచాయితీ, అటవీ శాఖల అధికారులకు అంతర్గత శిక్షణ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు అవగాహన చేసుకొని వృత్తి రీత్యా విధులు నిర్వహించాలని, ఏమైనా సమస్యలు ఉన్నపుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చి నివృత్తి చేసుకోవాలని అన్నారు. అవగాహనతో పాటు ప్రయోగాత్మకంగా శిక్షణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి వరుణ్ రెడ్డి మాట్లాడుతూ, రెవెన్యూ, పంచాయితీ, అటవీ శాఖల అధికారులకు కల్పించిన శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగ పరచుకొని, భవిష్యత్ లో ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలను సమన్వయంతో విధులు నిర్వహించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ, శాఖల సమన్వయంతో పనులు నిర్వహించాలని అన్నారు. అనంతరం ఆయా ఉద్యోగులకు ప్రయోగాత్మక శిక్షణ నిర్వహించారు. జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ మాట్లాడుతూ, మొబైల్ యాప్ ద్వారా ప్రయోగాత్మకంగా విధులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, జడ్పీ సీఈఓ గణపతి, తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, ఎంపీఓ లు, పంచాయితీ కార్యదర్శులు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post