DPRO ADB – షెడ్యూల్డు కులాల నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల నియామకానికి ఉచిత శిక్షణ- జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి సునీతా కుమారి.

షెడ్యూల్డు కులాల నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల నియామకానికి ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిణి సునీతా కుమారి తెలిపారు. శుక్రవారం రోజున స్థానిక పోలీస్ ట్రైనింగ్ కేంద్రంలో పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్.ఐ. ఉద్యోగ నియామకాల ఉచిత శిక్షణకు ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ కానిస్టేబుళ్లు, ఎస్.ఐ. ఉద్యోగ నియామకాల ఉచిత శిక్షణకు 112 మంది ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా, 80 అభ్యర్థులు ఎంపిక కు హాజరుకాగా 60 మంది యువతను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 100 మంది ఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వాలని ఆదేశించారని అన్నారు. ఈ ఉచిత శిక్షణను పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో రెండు నెలల పాటు ఇవ్వడం జరుగుతుందని, ఇందులో మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాల 300 మంది అభ్యర్థులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, ఉచిత వసతి సౌకర్యాలతో పాటు భోజనం, స్టడీ మెటీరియల్ అందిస్తామని పేర్కొన్నారు. ఈ ఎంపిక కార్యక్రమంలో DSP ఉమా హమేశ్వర్ రావు, డీటీసీ సిఐ గంగాధర్, ఎస్సైలు రామస్వామి, రామారావు, పద్మ, ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post