DPRO ADB-సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాలు, తదితర విద్యాసంస్థలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

సంక్షేమ వసతి గృహాలు, కస్తూర్బా విద్యాలయాలు, తదితర విద్యాసంస్థలలో స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యార్థులు ఆరోగ్యం, భోజనం, వసతి సౌకర్యాలలో సమస్యలు తలెత్తకుండా సంక్షేమ అధికారులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖల మంత్రి శనివారం రోజున పోడు భూములు, దళితబంధు, ఆసరా ఫించన్లపై సమీక్షించనున్న సందర్భంలో శుక్రవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, సంక్షేమ శాఖల పరిధిలో నిర్వహిస్తున్న వసతి గృహాలలో విద్యార్థులకు సౌకర్యాల కల్పనతో పాటు పర్యవేక్షణ నిర్వహించాలని అన్నారు. ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేయాలనీ అన్నారు. దళితబంధు లబ్ధిదారుల యూనిట్ లను త్వరితగతిన గ్రౌండింగ్ చేసి వారి ఆర్థిక స్థితిగతులను పెంపొందించాలని అన్నారు. జిల్లాలో కొత్తగా మంజూరైన 78,405 ఆసరా ఫించన్లు పంపిణీ పూర్తిచేయాలని అన్నారు. బతుకమ్మ చీరాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయా శాసన సభ నియోజక వర్గాల శాసన సభ్యుల సహకారంతో నిర్వహించాలని అన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ బాషా షేక్, ఎన్.నటరాజ్, ఆర్డీఓ రమేష్ రాథోడ్, జడ్పీ సీఈఓ గణపతి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఎస్సీ కార్పొరేషన్ ఈడి శంకర్, సంక్షేమ శాఖల అధికారులు రాజలింగం, సునీత కుమారి, కృష్ణవేణి, దిలీప్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post