DPRO ADB – సమాజ అభివృద్ధికి కవుల రచనలు ఉపయోగకరం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో కవి సమ్మేళనాన్ని నిర్వహించారు. ముఖ్య అతిధిగా హాజరైన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆమె ప్రసంగిస్తున్న కవులందరికి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు. కార్యక్రమానికి కవులు అధికసంఖ్యలో హాజరవడం అభినందనీయమన్నారు. ఇదే సంప్రదాయాన్ని మునుముందు కొనసాగించాలని కోరారు. సమాజ అభివృద్ధికి కవుల రచనలు ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం తెలుగు, హిందీ, మరాఠీ బాషలలో కవులు తమ కవితలను వినిపించారు. ఈ సందర్బంగా కవులను శాలువాలతో సత్కరించి, నగదు పురస్కారంతో పాటు కలెక్టర్ అవార్డులను ప్రధానం చేశారు. ఈ కవి సమ్మేళనంలో అదనపు కలెక్టర్ ఎన్. నటరాజ్, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్, ఆర్డీఓ రాథోడ్ రమేష్, డివైఎస్ఓ వెంకటేశ్వర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post