DPRO ADB- సాంస్కృతిక సారధి కళాకారులు ప్రభుత్వ సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం కల్పించాలి – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు . శుక్రవారం సాయంత్రం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సమాచార శాఖ ఆధ్వర్యంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దళితబంధు, ఇతర సంక్షేమ పథకాలపై తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు రూపొందించిన పాటల సిడి ని ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తీ స్థాయిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జిల్లాలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు ప్రచారం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, దళితబంధు, హరితహారం, రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, శానిటేషన్, వివిధ ప్రభుత్వ సంక్షేమ, ఇతర ప్రచార కార్యక్రమాల గురించి జిల్లా పౌర సంబంధాల అధికారిని అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్, సహాయ పౌర సంబంధాల అధికారి విష్ణు వర్ధన్, సాంస్కృతిక సారధి కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post