DPRO ADB-స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలకు సర్వం సిద్ధం- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఆదిలాబాద్ స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికలను సమర్థవంతంగా, ఎన్నికల నియమావళి ననుసరించి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ నెల 10 (శుక్రవారం) రోజున స్థానిక సంస్థల శాసన మండలి ఎన్నికల సందర్బంగా స్థానిక టీటీడీసీలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుండి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ మెటీరియల్ తో పోలింగ్ సిబ్బందిని గురువారం రోజున పంపించడం జరిగిందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 8 పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. మొత్తం 937 మంది స్థానిక సంస్థల ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఇందులో 308 మంది కౌన్సిలర్లు, 65 మంది జడ్పీటీసీ లు, 554 ఎంపీటీసీ లు, 10 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆదిలాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరం హాల్ ఆదిలాబాద్ లో, ఉట్నూర్ లో మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. మంచిర్యాల జిల్లాలో జిల్లా ప్రజాపరిషత్ పాత సమావేశం హాలు మంచిర్యాలలో, మండల ప్రజాపరిషత్ మొదటి అంతస్తు బెల్లంపల్లిలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. నిర్మల్ జిల్లాలో జిల్లా పరిషత్ కార్యాలయం నిర్మల్ అర్బన్ లో, మండల ప్రజాపరిషత్ కార్యాలయం బైంసా లో ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల రూమ్ నంబర్-2 ఆసిఫాబాద్ లో, ప్రభుత్వ డిగ్రీ కళాశాల రూమ్ నంబర్-1 కాగజ్ నగర్ లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో 223 మంది, మంచిర్యాల జిల్లాలో 296 మంది, నిర్మల్ జిల్లాలో 253 మంది, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 165 మంది స్థానిక ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని ఎనిమిది పోలింగ్ కేంద్రాల పరిధిలో పోలింగ్ విధులు నిర్వహించేందుకు 64 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. ఆయా పోలింగ్ కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ కొరకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. ఇందులో 12 మంది ప్రిసైడింగ్ అధికారులు, 12 మంది జోనల్ అధికారులను, 12 మంది సూక్ష్మ పరిశీలకులను, 28 మంది పోలింగ్ అధికారులను నియమించడం జరిగిందని తెలిపారు. శుక్రవారం రోజున పోలింగ్ మెటీరియల్ తో పోలింగ్ సిబ్బంది జోనల్ అధికారుల నేతృత్వంలో ప్రత్యేక బందోబస్తు తో ఆయా పోలింగ్ కేంద్రాలకు వాహనాల్లో చేరుకోవడం జరిగిందని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. పోలింగ్ సిబ్బందికి అందజేసిన మెటీరియల్ ను ఆయా పోలింగ్ సిబ్బంది పరిశీలించుకోవడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, పోలీస్, ఎన్నికల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Share This Post