ఇప్పటికే ఓటర్లుగా నమోదైనా ప్రతీ ఒక్కరు స్వచ్ఛంధంగా తమ ఓటుకార్డుకు ఆధార్ కార్డుకు అనుసంధానం చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి B.లక్ష్మణ్ అన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా సోమవారం రోజున స్థానిక గౌతమి డిగ్రీ కళాశాలను సందర్శించి విద్యార్థులకు ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరు ఓటరుగా నమోదు కావాలన్నారు. కళాశాలలో సీనియర్ విద్యార్థులు ఇద్దరు, జూనియర్ విద్యార్థులు ఇద్దరు, మొత్తం నాలుగురు విద్యార్థులు అంబాసిడర్లుగా ఏర్పడి ఈ ఓటరు అవగాహన కార్యక్రమాలను నిర్వర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ హమీద్, నాయబ్ తహసిల్దార్ ప్రవీణ్ కుమార్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.