జిల్లాలో హరితహారం కార్యక్రమంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో 8 వ విడత తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలుపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జులై మాసంలో ప్రారంభం కానున్న హరితహారం కార్యక్రమం అమలుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం 44 లక్షల 74 వేల మొక్కలు నాటడానికి ప్రణాళికలు రూపొందించడం జరిగిందని తెలిపారు. లక్ష్యానికి అనుగుణంగా నర్సరీలలో కావలసిన మొక్కలు అందుబాటులో ఉంచాలని, వేసవి దృష్ట్యా మొక్కల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు శాఖల వారిగా మొక్కలు నాటే స్థలాలను గుర్తించాలని అన్నారు. ప్రాజెక్టులు, చెరువులు, కాలువల గుండా అధిక సంఖ్యలో మొక్కలు నాటేల నీటిపారుదల, అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలలో పచ్చదనం పెంపొందే విధంగా విరివిగా మొక్కలు నాటాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ పార్క్ లలో మొక్కలు నాటాలని అన్నారు. ప్రతి మండలంలో మోడల్ నర్సరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అటవీ అధికారులు, ఎంపీడీఓలు, ఎపిఓలు మండలాలు, గ్రామాల వారిగా ఉన్న నర్సరీల సంరక్షణకు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు ఎన్.నటరాజ్, రిజ్వాన్ బాషా షేక్, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్, నీటిపారుదల శాఖ ఈఈ పి.రాము, జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ రాజేశ్వర్, జిల్లా విద్యాశాఖ అధికారిణి ప్రణీత, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
You Are Here:
Home
→ DPRO ADB- హరితహారం కార్యక్రమంలో లక్ష్యం మేరకు మొక్కలు నాటాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.
You might also like:
-
ITDA UTNOOR: గిరిజన విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి. ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి.
-
DPROADB- ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.
-
DPROADB- అకస్మాత్తుగా కుప్పకూలి పోయి మరణాలు సంభవించకుండా సి.పి.ఆర్. సేవలు అందించేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలి- జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.పి.ఎస్.
-
DPRO ADB: పట్టణ ప్రజలు తమ ఇంటిపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్.