DPRO ADB – 01 ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజక వర్గానికి నోటిఫికేషన్ జారీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్.

01-ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజక వర్గం నుండి తెలంగాణా శాసన మండలి సభ్యుని ఎన్నికకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మంగళవారం రోజున కలెక్టరేట్ లో ఎన్నికల నోటిఫికేషన్ ను జారీ చేశారు. ఇట్టి ఎన్నికకు సంబంధించి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని కలెక్టరేట్లు, ఆర్.డి.ఓ. కార్యాలయాలు, తహశీల్ధార్, మండల పరిషత్ కార్యాలయాలు, మునిసిపాలిటీలలో నోటీసు బోర్డులపై ప్రదర్శించవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగిందని తెలిపారు. నేటి నుండి ప్రభుత్వ సెలవు దినాలైన 19, 21 మినహా, ఈ నెల 23 వరకు నామినేషన్లు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలను కలెక్టరేట్ నుండి పొంది ఎన్నికల కమిషన్ నిర్దేశించిన సమయంలో నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ లేదా సహాయ ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ లకు సమర్పించవచ్చని తెలిపారు. ఈ నామినేషన్ పత్రాల పరిశీలన ఈ నెల 24న నిర్వహిస్తామని తెలిపారు. నామినేషన్ లను ఉపసంహరించుకునే అభ్యర్థులు ఈ నెల 26న మధ్యాహ్నం 3 గంటల లోగా ఎన్నికల అధికారి లేదా సహాయ ఎన్నికల అధికారికి ఉప సంహరణ నోటీసు అభ్యర్థి లేదా అతని ప్రతిపాదకుడు లేదా అనుమతి పొందిన ఏజెంట్ సమర్పించి ఉప సంహరించుకోవచ్చని తెలిపారు. ఇట్టి ఎన్నికకు పోటీ ఏర్పడినచో డిసెంబర్ 10 వ తేదీన ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. మొదటిరోజైన మంగళ వారం నాడు ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని కలెక్టర్ తెలిపారు.

Share This Post