DPRO ADB-15 – 18 సంవత్సరాల మధ్య వయసుగల పిల్లలు వ్యాక్సిన్ తీసుకోవాలి- జిల్లా కలెక్టర్ సిటీకా పట్నాయక్.

15 సంవత్సరాలకు పైబడిన వారందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపట్టి ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 15 నుండి 18 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ టీకా పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం రోజున స్థానిక శాంతి నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో 15 నుండి 18 సంవత్సరాల వయసు గల వారు 49,620 మంది ఉన్నట్లు గుర్తించామని, వారందరికీ టీకా పంపిణీ చేసేందుకు జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వ్యాక్సిన్ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఈ రోజు నుండి పిల్లల కోసం ప్రారంభం అయిన వ్యాక్సిన్ పంపిణీని అర్హత గల పిల్లలందరు సద్వినియోగ పరుచుకోవాలని అన్నారు. జిల్లాలో మొదటి, రెండవ డోస్ లు అర్హత గల వారందరికీ ఇంటింటికి తిరిగి వైద్య సిబ్బంది అందించడం జరుగుచున్నదని అన్నారు. రెండవ డోస్ నిర్ణిత సమయానికి తీసుకోవాలని అన్నారు. వైద్యం, పంచాయితీ, మున్సిపల్, తదితర శాఖల సమన్వయంతో టీకా పంపిణీ అందించడం జరిగిందని తెలిపారు. గత మాసం నుండి ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోవడంతో పాటు ప్రతి ఒక్కరు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని, తరచుగా చేతులను శానిటైజ్ చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.నరేందర్ రాథోడ్, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా.సాధన, మున్సిపల్ కమీషనర్ శైలజ, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డా.శ్రీకాంత్, వైద్య సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post