DPRO ADB- 2022-2024 సంవత్సరము లకు గాను మీడియా ప్రతినిధులకు అక్రిడిటేషన్ ల జారీకి దరఖాస్తులు ఆహ్వానం -జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

జిల్లాలో 2022-24 సంవత్సరానికి గాను రెండేండ్ల వ్యవధి గల అక్రిడిటేషన్ కార్డు ల జారీకి మీడియా ప్రతినిధుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ అండ్ చైర్మన్, జిల్లా మీడియా అక్రెడిటేషన్ కమిటీ ఒక ప్రకటనలో తెలిపారు. 2019 సంవత్సరంలో జారీ చేసిన అక్రిడిటేషన్ కార్డు ల కాల పరిమితి జూన్ 30 వ తేదీ నాటికి ముగుస్తున్న దృష్ట్యా కొత్త గా అక్రిడిటేషన్ కార్డు ల జారీకి అర్హులైన జర్నలిస్టు ల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తుట్లు తెలిపారు.

జిల్లాలోని అర్హులైన జర్నలిస్టులు సమాచారశాఖ ఆన్లైన్ వెబ్ సైట్ https:/ipr.telangana.gov.in/ ను సందర్శించి మెనూ క్రింద చూపించే మీడియా అక్రిడిటేషన్ లింక్ ను క్లిక్ చేసి జర్నలిస్ట్ లకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేయాలని, ఆన్లైన్ అప్లికేషన్ ఫారం తో పాటు అవసరమైన డాక్యుమెంట్ లను, ఫోటోలను అప్ లోడ్ చేయాలని ఆ ప్రకటనలో తెలిపారు.

ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ కు జూన్ 4 వ తేదీ తుది గడువు అని, ఆదిలాబాద్ జిల్లాలోని అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానికి మీడియా జర్నలిస్ట్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అర్హులైన వారు ఆన్ లైన్ లో గడువు లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post