DPRO ADB – ADCC బ్యాంకు రుణాల పరిమితి పెంపు – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రైతులకు జిల్లా సహకార బ్యాంకుల ద్వారా అందించే బ్యాంకు రుణాల పరిమితిని పెంపుదల చేస్తున్నామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. బుధవారం రోజున జిల్లా పరిషత్ లోని వనరుల శిక్షణ కేంద్రంలో ఆదిలాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, 2022 -23 సంవత్సరములకు గాను పంట రుణాల పరిమితిని గతంలో మంజూరు చేస్తున్న దానికంటే ఎకరానికి 20 శాతం రుణపరిమితిని పెంచడానికి కమిటీ సిఫారసు చేసిందని తెలిపారు. ఈ సమావేశంలో బ్యాంకు అధ్యక్షులు రఘునందన్ రెడ్డి, సీఈఓ శ్రీధర్ రెడ్డి, ఉమ్మడి జిల్లాల లీడ్ బ్యాంకు మేనేజర్లు, వ్యవసాయ, ఉద్యానవన అధికారులు, కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post