DPRO ADB- SSR క్లెయిమ్ లను వెంటనే పరిష్కరించండి- ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్.

ప్రత్యేక ఓటర్ నమోదుకు సంబందించిన క్లెయిమ్ లను త్వరితగతిన పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం రోజున హైదరాబాద్ లోని బుద్ధ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ నమోదు, మార్పులు చేర్పులు, సవరణలు, తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ ప్రక్రియ వచ్చే శుక్రవారం లోగా పూర్తీ చేయాలనీ అన్నారు. ఓటర్ నమోదుకు విస్తృత ప్రచారం నిర్వహించాలని అన్నారు. గరుడ యాప్ వినియోగం పై బూత్ స్థాయి అధికారులకు అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. బూత్ స్థాయి అధికారులకు రెమ్యూనరేషన్ చెల్లించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలో 5025 క్లెయిమ్ లు రావడం జరిగిందని, పలు కారణాల వలన 126 దరఖాస్తులను తిరస్కరించడం జరిగిందని, ఇప్పటివరకు 4892 క్లెయిమ్ లను అప్ లోడ్ చేయడం జరిగిందని, మిగితా దరఖాస్తులు అప్ లోడ్ ప్రక్రియ జరుగుచున్నదని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్లు శ్రీవాణి, సాయి మహేష్, సాంకేతిక సిబ్బంది ఉమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post