DPRO ADB-SSR- 2022 క్రింద వచ్చిన దరఖాస్తులు అప్డేట్ చేస్తున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి వేగవంతంగా ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు. సోమవారం ఓటర్ నమోదు కార్యక్రమం, గరుడ యాప్, ఓటర్ హెల్ప్ లైన్ వినియోగం, నిధుల సద్వినియోగంపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా నమోదు చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి తొలగించాలని అన్నారు. శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. ఓటర్లు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునేందుకు భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ రూపొందించిందని దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలని అన్నారు. స్వీప్ కార్యక్రమాలను నిర్వహించాలని, స్వీప్ కొర్ కమిటీ సమావేశం నిర్వహించి అర్హులైన వారిని ఓటర్ గా నమోదు చేసుకునే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని, స్థానిక మీడియా సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో చేపట్టిన ప్రచార కార్యక్రమాలకు సంబంధించిన డాక్యుమెంటేషన్ పంపించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎమ్యెల్సీ ఎన్నిక కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తీ చేసి ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం లెక్కింపు చేపట్టాలని అన్నారు. కౌంటింగ్ కేంద్రాలలోకి ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండే విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులతో సమీక్షిస్తూ, ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం సందర్బంగా 9674 దరఖాస్తులు వచ్చాయని వాటిని పరిశీలించి 7511 దరఖాస్తులు ఆమోదించినట్లు, 207 దరఖాస్తులు పలు కారణాల వలన తీరస్కరించడం జరిగిందని తెలిపారు. ఆమోదించిన దరఖాస్తులలో 6087 దరఖాస్తులు అప్ డేట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ITDA ప్రాజెక్టు అధికారి అంకిత్, అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, తదితరులు పాల్గొన్నారు.

Share This Post