DPRO ADILABAD: పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి – జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్.

పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహిస్తున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అన్నారు. శుక్రవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పరీక్షా కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసారు. విద్యార్థుల హాజరు శాతం, కల్పిస్తున్న సౌకర్యాలు సిసి టీవిల పనితీరును చీఫ్ సూపరిండెంట్ లను అడిగి తెలుసుకున్నారు. అనుమతి లేని వస్తువులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించకూడదని, మాస్ కాపీయింగ్ కు తావివ్వకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి నేపథ్యంలో త్రాగునీరు, అత్యవసర వైద్య సేవలకు వైద్య సిబ్బంది అందుబాటులో ఉండలన్నారు. జిల్లా ఉన్నతాధికారులు, మండల తహసీల్దార్లు ప్రశాంత వాతావరణంలో పరీక్షలను నిర్వహించేలా పర్యవేక్షిస్తున్నారని అన్నారు. అదనపు కలెక్టర్ వెంట విద్యాశాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

 

.

Share This Post