: సీజనల్ వ్యాధుల పై సంబంధిత అధికారుల తో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ లోకల్ బాడీస్ (కరీంనగర్ జిల్లా).

 

వ్యాధుల నియంత్రణకు అధికారులు బాధ్యత, జవాబుదారీతనంతో పని చేయాలి

 

వసతి గృహాలు, పాఠశాలలను ప్రతిరోజు శుభ్రం చేయాలి

నీటిని వేడి చేసి చల్లార్చి తర్వాత ఇవ్వండి

అన్ని మున్సిపాలిటీలు, గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ చేయాలి


వర్షాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉన్న పాఠశాలగదులను గుర్తించి వెంటనే మూసివేయాలి

ప్రాథమిక, మండల, జిల్లా పరిషత్ అంగన్వాడి పాఠశాలల్లో మిషన్ భగీరథ కనెక్ట్ చేసిన వివరాలు తెలపండి

పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహించాలి

జిల్లా ప్రధాన ఆసుపత్రి కరీంనగర్ లో100, హుజరాబాద్20, జమ్మికుంట20 ప్రభుత్వ ఆసుపత్రులు సీజనల్ వ్యాధి గ్రస్తుల కోసం బెడ్స్ ఏర్పాటు చేయాలి

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
0000000

భారీ వర్షాల వల్ల డెంగ్యూ మలేరియా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా బాధ్యత జవాబుదారితనంతో పనిచేయాలని, వ్యాధుల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అధికారులను ఆదేశించారు.

సోమవారం రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్న అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో వ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ సమావేశం నిర్వహించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వర్షాల వల్ల డెంగ్యూ, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలన్నారు. మున్సిపాలిటీ, గ్రామాల్లో దోమల నివారణకు యాంటీ లార్వా స్ప్రే చేయాలని, ఫాగింగ్ చేపట్టాలని పంచాయతీ రాజ్ మున్సిపల్ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి నియంత్రణ కు చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వసతి గృహం, పాఠశాలను ప్రతిరోజు శుభ్రం చేయాలని, ఫుడ్ పాయిజనింగ్ ఆయన వెంటనే తెలియజేయాలని, సంబంధిత మండల ఎంపీడీవో, తహసీల్దార్ అట్టి ప్రదేశానికి వెళ్లి వివరాలను తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహంలో ఉన్న విద్యార్థులకు నీటిని వేడి చేసి చల్లార్చిన తర్వాత ఇవ్వాలని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వసతి గృహాలను జిల్లా అధికారులు సందర్శించాలని, వసతి గృహం లోని విద్యార్థులతో భోజనం చేసి ఆహారమును పరిశీలించాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి బాధ్యత, జవాబుదారీతనంతో పనిచేయాలన్నారు. వసతి గృహాలు , కిచెన్ షెడ్, స్టోర్ రూమ్ లు, టాయిలెట్స్ పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు. వసతి గృహాలను మున్సిపల్ పంచాయతీ రాజ్ సిబ్బంది ప్రతిరోజు క్లీన్ చేసి ప్రిన్సిపాల్ తో సంతకం తీసుకోవాలన్నారు. ఎంపీడీవో, ఎం పి ఓ, పంచాయతీ కార్యదర్శులు డెంగ్యూ విష జ్వరాలు మలేరియా ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీజనల్ వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేకంగా కరీంనగర్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో100, హుజురాబాద్ ప్రభుత్వాసుపత్రిలో 20, జమ్మికుంట ప్రభుత్వాసుపత్రిలో20 బెడ్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యుధికారులు మండలాల వారీగా సమావేశం ఏర్పాటు చేసుకుని వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సినేషన్ ప్రికాషన్స్ డోస్ అర్హులైన అందరికీ ఇవ్వాలన్నారు. ఈ నాలుగు నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు పారిశుద్ధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నందున ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం పై ప్రతి సోమవారం సమావేశం ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ నల్లాలు కనెక్ట్ అయినా పాఠశాల లేని ఇంకా చేయవలసిన ఎన్ని వివరాలు తెలియజేయాలన్నారు. ప్రాథమిక, మండల,జిల్లా పరిషత్, అంగన్వాడీ కేంద్రాలలో మిషన్ భగీరథనల్ల ద్వారా నీరు కనెక్ట్ అయ్యేలాచూడాలన్నారు. వర్షాల వల్ల కూలిపోయే ప్రమాదం ఉన్న పాఠశాలలను, పాఠశాల గదులను గుర్తించి వాటిని క్లోజ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వసతి గృహాలు, పాఠశాలల్లో ఫుడ్ పాయిజనింగ్ కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అందుబాటులో ఉండాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ గారిని అగర్వాల్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, ఉపసంచాలకులు, జిల్లా అభివృద్ధి శాఖ నేతినీయాల్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి గంగారాం, జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజగోపాల్, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మధుసూదన్ రావు, చెందిన అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Share This Post