పత్రికా ప్రకటన
తేదీ :01-08 -2021
కరీంనగర్
జిల్లా పరిషత్ సర్వ సభ్య సమావేశం వాయిదా
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ
O0o
జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని సభ్యులు హాజరు కానందున వాయిదా వేసినట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ అన్నారు. ఆదివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయము 11 గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించుటకు హాజరు కాగా 11:30 గంటల వరకు వేచి చూసిన కూడా సభ్యులు సమావేశానికి హాజరు కానందున జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కనుమల విజయ తెలిపారు . జిల్లా మంత్రివర్యుల అనుకూలమైన సమయం తీసుకొని తిరిగి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామని చైర్పర్సన్ తెలిపారు.
ఈ సర్వసభ్య సమావేశానికి సమావేశానికి జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక ,జిల్లా అధికారులు తదితరులు హాజరు అయినారు
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్