DPRO KMNR తేది : 01-09-2021 : ఫోటోలు : హుజురాబాద్ మండలం శాలపల్లి -ఇంద్రానగర్ లో దళిత బంధు ఇంటింటి సర్వేలో ఇంటి యజమానులతో అనంతరం వీణవంక మండలం కొండపక ZPHS లో పిల్లలతో మాట్లాడుతున్న కలెక్టర్ ఆర్ వి కర్ణన్, పాల్గొన్న అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరిమ అగర్వాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్ (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన , తేదీ:01-09-2021

దళిత బంధుతో దళితుల జీవితాల్లో ఊహించని మార్పు

– జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

– హుజరాబాద్ మండలం శాలపల్లి -ఇంద్ర నగర్ లో దళిత బందు సర్వే పరిశీలన

– వీణవంక మండలం కొండపాక వద్ద మానేరు వాగు నీటి ప్రవాహం పరిశీలించిన కలెక్టర్
000000

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా హుజరాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం దళితుల జీవితాల్లో ఊహించని మార్పు తీసుకొస్తుందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

బుధవారం హుజరాబాద్ మండలం శాలపల్లి – ఇంద్రానగర్ లోని దళితవాడలో దళిత బంధు సర్వేను పరిశీలించారు. దళిత కుటుంబాలు దళిత బంధు పథకం ద్వారా ఎంపిక చేసుకుంటున్న యూనిట్ ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ లాభసాటిగా ఉండే యూనిట్లను ఎంపిక చేసుకొని ఆర్థికంగా ఎదగాలని దళిత కుటుంబాలకు సూచించారు. అనంతరం వీణవంక మండలం కొండపాక వద్ద మానేరు వాగు ప్రవాహాన్ని పరిశీలించారు. కొండపాక లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడారు. లాక్ డౌన్ సమయములో విద్యార్థులు పాఠాలు ఎలా చదివారో వారిని అడిగి తెలుసుకున్నారు. బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీ గరిమ అగర్వాల్, జడ్పీ సీఈఓ ప్రియాంక కర్ణన్ , అసిస్టెంట్ కలెక్టర్ మయంక మిట్టల్, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.

 

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది.

Share This Post