పత్రికా ప్రకటన తేదీ1-9-2021
మినీ డైయిరీ లకు ప్రాధాన్యత ఇవ్వాలి
_ జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
దళిత బంధు ద్వారా అందే 10 లక్షల రూపాయలతో మినీ డైయిరీ ఏర్పాటు చేసుకొని ఆర్థిక పురోగతి సాధించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ దళిత కుటుంబాలకు సూచించారు.
బుధవారం హుజురాబాద్ మండలంలోని పెద్ద పాపయ్య పల్లె దళితవాడలో దళిత బంధు సర్వే పనితీరును పరిశీలించారు. సర్వే బృందం సేకరిస్తున్న వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దళిత కుటుంబాలతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందించే దళిత బంధు పథకాన్ని సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ప్రియాంక , తహసిల్దార్ రామ్ రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ గారిచే జారీ చేయడమైనది.