DPRO KMNR తేది: 03-08-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : థర్డ్ వేవ్ కరోనా పై మీడియా సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్న సి పి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్. ( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన

తేదీ:-03-08 -2021

కరీంనగర్

జిల్లాలో కోవిడ్ థర్డ్ వేవ్ రాకుండా పటిష్టమైన చర్యలు

మాస్కు ధరించ కుంటే కఠిన చర్యలు

ప్రతిరోజు 9వేల మందికి కోవిడ్ పరీక్షలు
గ్రామంలో 5 పాజిటివ్ కేసులు వస్తే ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
O0o

 

జిల్లాలో కోవిడ్ థర్డ్ వేవ్ , డెల్టా వేరియంట్ రాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్ అన్నారు .

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పోలీస్ కమిషనర్ టి. సత్యనారాయణ తో కలిసి కోవిడ్ నియంత్రణ చర్యలపై ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో , ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను పెంచామని తెలిపారు . కోవిడ్ కేసులు ఎక్కువ నమోదు అవుతున్న గ్రామాలలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు . ఒక్క కొవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సంబంధించి 20 మంది ప్రైమరీ కాంటాక్ట్ కింద గుర్తించి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు . జిల్లాలో ఇంత వరకు 8.35 లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపారు. అందులో 60 వేల మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వీరిలో 97 శాతం మంది రికవరీ అయినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 2400 యాక్టివ్ కేసులు ఉన్నాయని తెలిపారు . ప్రతిరోజు జిల్లాలో ఎనిమిది వేల నుండి తొమ్మిది వేల వరకు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు . జిల్లాలో 1 నుండి 2 శాతం వరకు కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి లో ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామని, కరీంనగర్ ఉమ్మడి జిల్లా లోని సిరిసిల్ల,జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల నుండి కూడా కరీంనగర్ వచ్చి ఆర్ టి పి సి ఆర్ పరీక్షలు చేయించుకుంటున్నారని కలెక్టర్ తెలిపారు . జూలై 1 నుండి ఆగస్టు 1 వరకు 2.4 లక్షల పరీక్షలు చేయగా 1.7 శాతం పాజిటివ్ కేసులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు . 5 కన్నా ఎక్కువ కోవిడ్ పాజిటివ్ వచ్చిన గ్రామాలలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు . కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని , భౌతిక దూరం పాటించాలని, తరచుగా శానిటైజర్ తో చేతులు శుభ్రపరచుకోవాలి అని కలెక్టర్ సూచించారు. అలాగే జనసమూహం, గుంపులు గుంపులుగా ఉండకూడదని కలెక్టర్ ప్రజలను కోరారు. జిల్లాలో గంగాధర, కొత్తపల్లి , సైదాపూర్, చిగురుమామిడి, చొప్పదండి, వీణవంక, హుజురాబాద్ మండలాలలో కోవిడ్ కేసులు ఎక్కువ నమోదవుతున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలందరూ నియంత్రణ చర్యలు తూచా తప్పకుండా పాటించాలని కలెక్టర్ ప్రజలను కోరారు.ఇప్పటికే 30 ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశామని ఇందులో 40 మంది ఉన్నారని తెలిపారు.

పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని ,లేకుంటే వెయ్యి రూపాయలు ఫైన్ విధిస్తామని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో 50 పోలీస్ బృందాలను ఏర్పాటు చేసి మాస్కు దరించని వారిని గుర్తించి ఫైన్ వేస్తున్నామని తెలిపారు. అలాగే రెండు మూడు సార్లు మాస్కు దరించ క పట్టుబడితే కేసులు కూడా నమోదు చేస్తామని సీపీ తెలిపారు. కొవిడ్ వ్యాధితో చాలా మంది చనిపోయారని తగిన జాగ్రత్తలు తీసుకుంటే కోవిడ్ రాకుండా నిరోధించవచ్చని తెలిపారు. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని ,కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.

ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ, సుధాకర్ రెడ్డి,సహాయ సంచాలకులు అబ్దుల్ కలీం తదితరులు పాల్గొన్నారు

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post