DPRO KMNR తేది: 03-08-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : హుజురాబాదు మండలం శాలపల్లి – ఇంద్రానగర్ గ్రామాలలో ఈ నెల 16 వ తేదీన ప్రారంభించనున్న దళిత బంధు కార్యక్రమనికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పర్యటన స్థల పరిశీలన చేస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ, సివిల్ సప్లై మంత్రివర్యులు గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్న సి పి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు. ( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన

తేదీ :03-08-2021

హుజురాబాద్

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు

దళితులను సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు దళిత బంధు పథకం

రాష్ట్ర బీసీ సంక్షేమ,పౌర సరఫరాలు శాఖ మంత్రి గంగుల కమలాకర్
00000

ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి హుజరాబాద్ లో దళిత బంధు కార్యక్రమాన్ని ప్రారంభించుటకు వస్తున్నారని , ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ,పౌర సరఫరాలు శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

మంగళవారం సాయంత్రం హుజురాబాద్ మండలంలోని శాలపల్లి – ఇందిరా నగర్ గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన సభా స్థలం ,ఏర్పాట్లను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో కలిసి మంత్రి పరిశీలించారు .ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ దళితులను సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా, రాష్ట్ర ముఖ్యమంత్రి దళితుల పై ప్రత్యేక శ్రద్ధతో దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇంతవరకు ప్రభుత్వాలు దళితులను ఓటు బ్యాంకుగా తప్ప వారి అభివృద్ధికి ఏ ప్రభుత్వం కృషి చేయలేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి దళిత బిడ్డను ఆర్థికంగా బలోపేతం చేయుటకు వీలుగా ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించి అదుకొనుటకు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు .మానవతా దృక్పథంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత పక్షపాతిగా, దళితుల అభివృద్ధి కోరుకునే వ్యక్తిగా ,దళిత బంధు పథకాన్ని ఈ నెల 16న హుజురాబాద్ లో ప్రారంభిస్తున్నారని అన్నారు . దేశంలో బిజెపి అధికారంలో ఉన్న ఉత్తర ప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాలలో దళితుల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఇలాంటి పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. ఈ నెల 16న నిర్వహించనున్న దళిత బంధు కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుండి లక్ష మందికి పైగా రానున్నారని మంత్రి తెలిపారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణలో ప్రవేశపెట్టి అమలు చేస్తున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల పై దేశంలోని అన్ని రాష్ట్రాలలో చర్చ జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో గల దళితుల ఆర్థిక స్థితిగతులను తెలుసుకొని వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేయుట లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. దళిత బంధు పథకం అమలు కోసం బడ్జెట్ లో 1000 కోట్లు కేటాయించాలని మంత్రి తెలిపారు . దళిత బంధు పథకం అమలుకు హుజురాబాద్ పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ప్రారంభించుటకు ఈనెల 16న రాష్ట్ర ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర రావు హుజురాబాద్ వస్తున్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ .వి కర్ణన్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ , అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ , ఆర్డిఓ రవీందర్ రెడ్డి , గ్రామ సర్పంచ్ కె.శారద – కిరణ్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post