DPRO KMNR తేది: 04-08-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : దళిత బంధు పథకం అమలుపై జిల్లా అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్. ( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన

తేదీ 04-08-2021

కరీంనగర్

దళిత బందు ద్వారా స్వయం ఉపాధికి మంచి యూనిట్లను ప్రతిపాదించాలి

సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా
O0000

దళిత బంధు పథకం ద్వారా దళితులకు మెరుగైన స్వయం ఉపాధి అవకాశాలు కల్పించుటకు ఉత్తమమైన యూనిట్లను ప్రతిపాదించాలని సాంఘిక సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా అన్నారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ట్రాక్టర్ డీలర్లు , విజయ డైయిరీ, కరీంనగర్ డైయిరీ ప్రతినిధులు, జిల్లా అధికారులతో దళిత బంధు పథకంపై సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెడుతున్న దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలు దళిత కుటుంబాలకు మంజూరు చేస్తారని తెలిపారు . దళిత బంధు పథకం 10 లక్షల రూపాయలతో మార్కెట్లో డిమాండ్ ఉన్న దళితులకు ఒక మంచి స్వయం ఉపాధి యూనిట్ స్థాపించుకుని ప్రతి నెల ఆదాయం సమాకుర్చుకునేలా, ఆర్థిక అభివృద్ధి సాధించుటకు వీలుగా, వారి జీవితాల్లో వెలుగులు నింపేలా ఉండుటకు వివిధ రకాల వినూత్న,మంచి స్వయం ఉపాధి యూనిట్లను సాయంత్రం లోగా ప్రతిపాదించాలని అధికారులకు సూచించారు. జిల్లా అధికారుల నుండి ప్రతిపాదించబడిన యూనిట్ల నుండి దళిత బంధు లబ్ధిదారులు కోరుకున్న యూనిట్లను మంజూరు చేస్తామని తెలిపారు . దళిత బందు లబ్ధిదారులు ఎంచుకున్న వివిధ స్వయం ఉపాధి యూనిట్ల నిర్వహణపై తగిన అవగాహన, శిక్షణ ఇప్పించాలని సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ , జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్య నిర్వహణాధికారి ప్రియాంక, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ , ఎస్సీ కార్పొరేషన్ ఈ .డి మధుసూదన్ శర్మ, జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి నేతి నియల్, ట్రాక్టర్ డీలర్ లు విజయ కరీంనగర్ పాల డైయిరీ ల డీలర్లు తదితరులు పాల్గొన్నారు .

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్.

Share This Post