DPRO KMNR తేది: 05-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : కోవిడ్ నియంత్రణ చర్యలు, సీజనల్ వ్యాధుల నియంత్రణ పై మాట్లాడుతున్న ప్రజా ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాస్ రావు పాల్గొన్న డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ కె. రమేష్ రెడ్డి, CMO-OSD డాక్టర్ టి. గంగాధర్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్. ( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన

తేదీ :04-08-2021

కరీంనగర్

కోవిడ్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి

ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ డి .శ్రీనివాసరావు

000000

కరీంనగర్ జిల్లాలో ఎక్కువ కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయని, జిల్లా యంత్రాంగం సహకారంతో కోవిడ్ నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ డి. శ్రీనివాసరావు వైద్య అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్ ఆఫీసర్లతో, కోవిడ్ నియంత్రణ చర్యలు, సీజనల్ వ్యాధుల నివారణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా లో కోవిడ్ థర్డ్ వేవ్, డెల్టా వేరియంట్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అన్నారు . మనకు తెలియకుండానే ప్రజల్లో కోవిడ్ పాజిటివ్ ఉందని, ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీటింగ్ ద్వారా కోవిడ్ ను నియంత్రించాలని అన్నారు. కోవిడ్ వ్యాధి చనిపోయే అంత జబ్బు కాదని , సరియైన వైద్యం అందిస్తే త్వరగా కోలుకుంటారని తెలిపారు. ఒకరికి కోవిడ్ పాజిటివ్ వస్తే , వారికి సంబంధించి ప్రైమరీ కాంట్రాక్టు కింద 20 నుండి 25 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని అన్నారు. కోవిడ్ పాజిటివ్ ఉన్న వారినందరిని క్వారంటైన్ చేస్తే కోవిడ్ వ్యాప్తి నివారించవచ్చునని తెలిపారు .మెడికల్ ఆఫీసర్లు కోవిడ్ కేసులు ఎక్కువ నమోదవుతున్న గ్రామాలలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అర్హులైన వారందరికీ కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించాలని అన్నారు. మెడికల్ ఆఫీసర్ లందరూ 50 శాతం సమయము గ్రామాలలో పర్యటించి నియంత్రణకు చర్యలు చేపట్టాలని అన్నారు .గ్రామాలలో కోవిడ్ కేసులను జీరోకు తీసుకురావాలని అన్నారు . కరీంనగర్ జిల్లాలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని అన్నారు . ప్రతిరోజు జిల్లాలో 8 నుండి 9 వేల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు జిల్లాలో ఎక్కువ జన సమూహాలు ఉన్న చోట మొబైల్ బృందాల ద్వారా కోవిడ్ పరీక్షలు చేయించాలని అన్నారు. ఇంటింటి జ్వరం సర్వేను నిరంతరంగా కొనసాగించాలని ఆదేశించారు.
వర్షాకాలంలో డెంగు, మలేరియా , వంటి విష జ్వరా లు , ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని డాక్టర్లను డైరెక్టర్ ఆదేశించారు. డెంగ్యూ ,మలేరియా, అంటు వ్యాధులు ఎక్కువ నమోదవుతున్న గ్రామాలలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని అన్నారు. అవసరమైన మందులను ఆరోగ్య కేంద్రాలలో నిలవ ఉంచుకోవాలని సూచించారు. జిల్లాలో డెంగ్యూ, మలేరియా , అంటువ్యాధులతో పాటు అతిసార వ్యాధులతో, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చేరిన రోగుల వివరాలను ప్రతిరోజు సేకరించాలని ఆదేశించారు .సీజనల్ వ్యాధుల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డాక్టర్లను ఆదేశించారు.

 

రాష్ట్ర వైద్య విద్య శాఖ డైరెక్టర్ కె .రమేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలా డాక్టర్లు గ్రామాలలో క్షేత్రస్థాయిలో పర్యటించి కోవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించాలని ఆదేశించారు . గ్రామాలలో కోవిడ్ నియంత్రణకు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించుకొని పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి నిరంతర వైద్య సేవలు అందించాలని సూచించారు .పాజిటివ్ వచ్చిన వారికి సరియైన సలహాలు, సూచనలు ఇచ్చి క్వారంటైన్ లో ఉండేలా చర్యలు గైకొనాలి అని అన్నారు. గ్రామాలలో కోవిడ్ పరీక్షల వివరాలు, పాజిటివ్ వచ్చిన కేసుల వివరాలను ప్రతిరోజు జిల్లా కేంద్రానికి పంపించాలని సూచించారు . కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారికి కోవిడ్ కిట్లు అందజేయాలని సూచించారు.

ముఖ్యమంత్రి కార్యాలయం ఓఎస్ డి టి .గంగాధర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున ముఖ్యమంత్రి ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయి అధికారులను కరీంనగర్ జిల్లాకు పంపించారని తెలిపారు .కరీంనగర్ జిల్లాలో కోవిడ్ నియంత్రణ చర్యలు పకడ్బందీగా అమలు చేయాలని డాక్టర్లకు సూచించారు . కోవిడ్ పాజిటివ్ వచ్చిన వ్యక్తులు బయట తిరిగి ఇతరులకు వ్యాప్తి చేయకుండా వారిని క్వారంటైన్ చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు . రాష్ట్రంలో ప్రతి రోజు లక్షకు పైగా కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు . కరీంనగర్ జిల్లాలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను మరింత పెంచాలని అన్నారు. జిల్లాలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించేలా, భౌతిక దూరం పాటించేలా, తరచుగా చేతులు శానిటైజర్ తో గాని సబ్బు తో గాని శుభ్రపరచుకునేల అవగాహన పెంపొందించాలని సూచించారు. ప్రతి ఒక్కరు కోవిడ్ నివారణ చర్యలు పాటిస్తే కోవిడ్ నియంత్రించవచ్చునని అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్,వైద్య ఆరోగ్య శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ బాలాజీ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా, జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాల, ప్రోగ్రామ్ ఆఫీసర్ లు, మెడికల్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు .

 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post