DPRO KMNR తేది: 06-08-2021 : ప్రెస్ నోట్ & ఫోటోలు : కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, ట్రైనీ కలెక్టర్ మయాంక్ మిట్టల్, ZP CEO ప్రియాంక. ( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన తేదీ 06-08 -2021 కరీంనగర్

రాష్ట్ర సాధనకు జీవితాన్ని ధారపోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
oOo

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు తన జీవితాన్ని ధారపోసిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని జిల్లా కలెక్టర్ ఆర్ .వి. కర్ణన్ అన్నారు .

శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి సందర్భంగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి అయన పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకు మేధావి వర్గాన్ని ఒకటి చేసి ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్ గరిమ అగర్వాల్, ట్రైనింగ్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక , జిల్లా బీసీ సంక్షేమ అధికారి రాజా మనోహర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీధర్, ముఖ్య ప్రణాళిక అధికారి కొమురయ్య,జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీలత, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య ఇతర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post