పత్రికా ప్రకటన
తేదీ 06-08 -2021
కరీంనగర్
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్
00000
రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ నెల 16న హుజురాబాద్ డివిజన్ పర్యటన సందర్భంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి కర్ణన్ అన్నారు.
శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారుల తో ముఖ్య మంత్రి పర్యటన ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు . ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 16న హుజురాబాద్ డివిజన్ లోని శాలపల్లి గ్రామంలో నిర్వహించు దళిత బంధు పథకం యూనిట్ల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా సభా నిర్వహించు స్థలాన్ని చదును చేయాలని, డయాస్ నిర్మించాలని రోడ్లు భవనాల శాఖ ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు . సభా ప్రాంగణంలో వి.ఐ.పి, ప్రెస్ , జిల్లా అధికారులకు, ప్రజలకు వేర్వేరుగా గ్యాలరీలను ఏర్పాటు చేసి పకడ్బందీగా బ్యారికేటింగ్ చేయాలని అన్నారు. ప్రెస్ గ్యాలరీ ఎలక్ట్రానిక్ మీడియాకు స్టెప్పులతో కూడిన డయాస్ ఏర్పాటు చేయాలని అన్నారు . సభా వేదిక డయాస్ ను పూలతో డెకరేషన్ చేయాలని, డయాస్ పై ఫెడస్టాల్ ఫ్యాన్లు, స్టాండింగ్ ఏసీలు ఏర్పాటు చేయాలని ఎస్ఈ కి సూచించారు. డయాస్ వెనుక భాగంలో వి ఐ పి లకు రిఫ్రెష్ మెంట్ రూమ్, బయో టాయిలెట్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్ బి ఎస్ఈ ని కలెక్టర్ ఆదేశించారు. వాహనాల పార్కింగ్ స్థలాన్ని చదును చేయించాలని, ర్యాంపులు నిర్మించాలని పంచాయతీరాజ్ ఈఈ, ప్రజారోగ్య శాఖ ఎస్.ఈ.ని , హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. డయాస్ పైన ప్రోటోకాల్ ప్రకారము సీట్ల ఏర్పాటు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి, జిల్లా మార్కెటింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు . పబ్లిక్ అడ్రస్ సిస్టం మైక్ అండ్ సౌండ్ సిస్టమును ఏర్పాటు చేయాలని కార్యనిర్వాహక సమాచార ఇంజనీర్ ను కలెక్టర్ ఆదేశించారు. డయాస్ పై పది కార్డులేసు మైక్ లను, పొడియం మైకు ఏర్పాటు చేయాలని అన్నారు. 4ఎల్ఈడి మానిటర్ లను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాన్స్కో సిబ్బంది సహకారంతో మైక్ అండ్ సౌండ్ సిస్టంమునకు సపరేటు గా జనరేటర్ ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా పౌర సంబంధాల అధికారిని ఆదేశించారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకు అవసరమైన మీడియా పాసులు జారీ చేయాలని కలెక్టర్ డి పి ఆర్ ఓ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి సభా వేదిక వద్ద అదనపు విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను ఏర్పాటు చేసి హుజరాబాద్ మండలంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ట్రాన్స్కో ఎస్ఈ ని ఆదేశించారు. సభా వేదిక వద్ద బయో టాయిలెట్స్, వీఐపీలకు, ప్రజలకు టాయిలెట్లు ఏర్పాటు చేయాలని , త్రాగు నీటి వసతి ఏర్పాటు చేయాలని పంచాయతీ రాజ్ ఎస్ . ఈ ని ఆదేశించారు . సభా వేదిక వద్ద పరిసరాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని చెత్తను వెంట వెంటనే బయటకు పంపించాలని, ప్రజలకు త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్య మంత్రి సభా వేదిక వద్ద కాన్వాయ్ లో అగ్నిమాపక వాహనాలను ఏర్పాటు చేయాలని జిల్లా ఫైర్ ఆఫీసర్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో మొబైల్ మెడికల్ టీమ్ ను ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ముఖ్య మంత్రి బ్లడ్ గ్రూప్ రక్తాన్ని , రక్తదాత తో సహా తో సభా వేదిక వద్ద సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు .సభా వేదిక వద్ద మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయాలని అన్నారు . ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్పెషలిస్ట్ డాక్టర్ల టీమ్ ను సిద్ధంగా ఉంచాలని జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ ను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి కి ఇచ్చు ఆహార పదార్థాలను పోలీస్ కమిషనర్ సహకారంతో పరీక్షలు చేయాలని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఏలాంటి లోటుపాట్లు లేకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు శ్యామ్ ప్రసాద్ లాల్ , గరిమ అగర్వాల్ , ట్రైనింగ్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక ,జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్.