DPRO KMNR తేది: 06-08-2021 : ఫొటోలు & PRESS NOTE : ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతి సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న రాష్ట్ర బీసీ సంక్షేమ , పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్., నగర మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి. ( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన

తేదీ : 06 -08 -2021

కరీంనగర్

ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా యువత నడవాలి

రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్.
VO000

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకు అహర్నిశలు కృషి చేసిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ ఆశయాలకు అనుగుణంగా యువత నడవాలి అని రాష్ట్ర పౌరసరఫరాలు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

ప్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా శుక్రవారం నగరంలోని మదీనా చౌరస్తా వద్ద గల ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త, తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని అన్నారు . ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి స్ఫూర్తి ప్రదాత ఆచార్య జయశంకర్ సార్ అని కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ ఆలోచనలు, ఆశయాల కనుగుణంగా అన్ని వర్గాల సంపూర్ణ అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ .వి. కర్ణన్, శాసనమండలి సభ్యులు నారదాసు లక్ష్మణరావు, నగర మేయర్ వై. సునీల్ రావు ,మున్సిపల్ కమీషనర్ వల్లూరి క్రాంతి, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు .

 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్.

Share This Post