పత్రికా ప్రకటన తేదీ:6-9-2021
డయలు యువర్ కలెక్టర్ సమస్యలను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలి
అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్
0000
డయల్ యువర్ కలెక్టర్ కు ప్రజలు తెలిపే సమస్యలను ప్రాధాన్యత ఇచ్చి వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజల సమస్యల పరిష్కారానికి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ప్రజాసమస్యలు పెండింగ్ లేకుండా వెంటవెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఇల్లంతకుంట మండలం నుంచి లక్ష్మీ మాట్లాడుతూ తన పంట పొలంలో తాటి చెట్లు ఉండటం వలన పంటకు నష్టం వాటిల్లుతుందని తెలపగా, ప్రభుత్వ జీవో ప్రకారం తాడి చెట్లను తొలగించడం వీలు కాదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. జమ్మికుంట మండలం కొరపల్లి నుంచి రాజయ్య మాట్లాడుతూ భూ సమస్యను పరిష్కరించాలని తెలపగా, తగిన ఆధారాలతో కోర్టులో కేసు వేసి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. శంకరపట్నం మండలం నుంచి సుజాత మాట్లాడుతూ తన తండ్రి మరణానంతరం పెన్షన్ చిన్నమ్మ తీసుకుంటోందని తనకు వచ్చేలా చూడాలని కోరగా, సమస్యను కోర్టులోనే పరిష్కరించుకోవాలి ఉంటుందని అదనపు కలెక్టర్ తెలిపారు. వివిధ మండలాల నుంచి పట్టా పాస్ పుస్తకాలు మంజూరు కాలేదని కొందరు తెలుపగా, మీ సేవలో దరఖాస్తు చేసుకొని పాస్ పుస్తకాలు పొందాలని అదనపు కలెక్టర్ తెలిపారు. అనంతరం జిల్లా అధికారులతో మాట్లాడుతూ కలెక్టరేట్లోని అన్ని కార్యాలయాలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్న కోర్టు కేసులకు కౌంటర్లను దాఖలు చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డిఓ ఆనంద్ కుమార్, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల శాఖ కార్యాలయం కరీంనగర్ వారిచే జారీ చేయడమైనది.