DPRO KMNR తేది : 06-09-2021 : ఫోటోలు & PRESS NOTE : కలెక్టరేటు ఆడిటోరియం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా పిర్యాదులు స్వీకరిస్తున్న అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ: 6-9-2021

కరీంనగర్
ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన

ప్రజావాణికి 116 దరఖాస్తులు

జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్ లాల్

0000

ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుందని అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించి 116 దరఖాస్తులు అందాయని, ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన దరఖాస్తులను పరిష్కరించుటకు వెంటనే సంబంధిత శాఖలకు పంపినట్లు అయన తెలిపారు. ఇందులో 77 రెవెన్యూకు సంబంధించినవి, 07 జిల్లా పంచాయతీ శాఖ కు చెందినవి, 32 ఇతర శాఖలకు సంబంధించినవని ఆయన తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖర్, జిల్లా వైద్యాధికారి డాక్టర్ జూవెరియా, డిపిఓ వీర బుచ్చయ్య,జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజమనోహర్, కలెక్టరేట్ ఏవో లక్ష్మారెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండ్లు, సిబ్బంది వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయడమైనది.

Share This Post