DPRO KMNR తేది: 07-08-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చెంద్రశేఖర్ రావు పర్యటన ఏర్పాట్ల పై జరిగిన సమావేశం లో మాట్లాడుతున్న మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్,అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యాం ప్రసాద్ లాల్, ట్రేని కలెక్టర్ మయాంక్ మిట్టల్, జడ్పీ CEO ప్రియాంక ( కరీంనగర్ జిల్లా )

పత్రికా ప్రకటన తేదీ 7 8 2021
కరీంనగర్

దళిత బంధు పథకం దేశానికి దిక్సూచి కాబోతుంది

దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు దళిత బందు

రైతులకు ఉచిత కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ

ఆగస్టు 16న దళితబందు సబా ఏర్పాట్లపై మంత్రుల ఉన్నతస్థాయి సమావేశం*

బాబాసాహెబ్ కలలుగన్న మార్పు సీఎం కేసీఆర్ గారు చేస్తున్నారు

రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

 

సాచురేషన్ మోడ్లో చేపట్టిన పథకం దళితబందు

పారదర్శకంగా దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక – మంత్రి కొప్పుల ఈశ్వర్
000000

ఈనెల 16న హుజురాబాద్ నియోజకవర్గం లో ప్రారంభించనున్న దళిత బంధు పథకం దేశానికి దిక్సూచి కాబోతోందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హుజురాబాద్ పర్యటన ఏర్పాట్లపై ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ,సామాజికంగా ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం ఈనెల 16న హుజరాబాద్ నియోజవర్గంలో ఆవిష్కరించనున్ననట్లు మంత్రి తెలిపారు . దళిత బంధు పథకం దేశానికి ఆదర్శం కాబోతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఒక మంచి సంకేతం ఇవ్వబోతుంది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి మంచి ఫలితాలు సాధించిందన్నారు. దేశంలో రైతులకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. రైతు బంధు, రైతు భీమా, ఆసరా పింఛన్లు కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. ఈనెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన కార్యక్రమాన్ని అన్ని విభాగాలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేసి వివిధ విజయవంతం చేయాలన్నారు. సమావేశానికి వచ్చే ప్రజలకు, లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. సభాస్థలి , పార్కింగ్, సానిటేషన్ , త్రాగునీటి కి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు. సభాస్థలి ప్రాంగణంలో శానిటేషన్ పనులను చేపట్టాలని పంచాయతీ అధికారి ని ఆదేశించారు. సమావేశానికి హాజరయ్యేందుకు వచ్చే లబ్ధిదారులను తీసుకు వచ్చేందుకు తగినన్ని బస్సులు ఏర్పాటు చేయాలని రీజనల్ మేనేజర్ ఆర్టీసీ ఆదేశించారు. ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా చూడాలని పోలీసు శాఖను ఆదేశించారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ఈనెల 16న హుజురాబాద్ లో ప్రారంభించనున్న దళిత బంధు కార్యక్రమం విజయవంతానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలన్నారు. దళితుల ఆర్థిక స్థితిగతులు మార్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వేల కోట్లు వెచ్చిస్తున్నారని అన్నారు , ప్రభా స్థలి వేదిక ,పార్కింగ్ కు, ట్రాఫిక్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. .గొప్పగా ఆలోచించి దళితవర్గాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దళితబందు కార్యక్రమం దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇన్నేళ్లలో రాలేదన్నారు. ఎలాంటి ఇబ్బందుల జరగకుండా ముఖ్యమంత్రి పర్యటన విజయవంతానికి అందరూ టీం వర్క్ గా పనిచేయాలన్నారు.
ఈనెల 16న నిర్వహించబోయే దళితబందు సభకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించి సబను విజయవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

 

ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావు, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అడిషనల్ కలెక్టర్ గరిమ అగర్వాల్, శ్యామ్ లాల్ ప్రసాద్,ఆర్టీసీ రిజినల్ మేనేజర్, పోలీస్ ఉన్నతాధికారులతో పాటు అన్ని ముఖ్య శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు..

సహాయ సంచాలకులు జిల్లాపౌర సంబంధాల అధికారి కరీంనగర్ చే జారీ చేయనైనది.

Share This Post