DPRO KMNR తేది: 07-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : జాతీయ చేనేత ర్యాలీని జెండా ఊపి ప్రారంభిచి, హ్యాంలూమ్స్ స్టాల్సును ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్. ( కరీంనగర్ జిల్లా )

పత్రికా ప్రకటన తేదీ :06-08 -2021
కరీంనగర్

చేనేత ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర ఆర్.వి.కర్ణన్

0000
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టేడియం నుండి ఏర్పాటు చేసిన చేనేత ర్యాలీని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ జండా ఊపి ప్రారంభించారు. ఈ చేనేత ర్యాలీ అంబేద్కర్ స్టేడియం నుండి కలెక్టరేట్ వరకు చేనేత ఉత్పత్తుల ప్రాధాన్యతను తెలుపు నినాదాలతో ర్యాలీ నిర్వహించారు . కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన చేనేత ఉత్పత్తుల స్టాల్ లను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సబ్సిడీ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. చేనేత ఉత్పత్తుల ను అమ్ముకొనుటకు ప్రభుత్వం నేత బజార్లను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రతి ఒక్కరు వారానికి ఒకరోజు చేనేత వస్త్రాలను ధరించాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ , జిల్లా పరిషత్ సిఈవో ప్రియాంక, చేనేత జౌళి శాఖ ఉప సంచాలకులు సంపత్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, పద్మశాలి జిల్లా సంఘం అధ్యక్షులు మెతుకు సత్యం, గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు, చేనేత కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్.

Share This Post