DPRO KMNR తేది: 07-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : జాతీయ చేనేత దినోత్సవ సమావేశం లో మాట్లాడుతున్న మంత్రులు గంగుల కమలాకర్,కొప్పుల ఈశ్వర్ పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్,అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్. ( కరీంనగర్ జిల్లా )

పత్రికా ప్రకటన

తేదీ 07- 08 -2021

కరీంనగర్

నేతన్నల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలు ధరించి ప్రోత్సహించాలి.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
00000

నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తోందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

శనివారం జాతీయ చేనేత దినోత్సవంను పురస్కరించుకొని కలెక్టరేట్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి సంక్షేమ శాఖ మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండేవని అన్నారు . తెలంగాణ ఉద్యమ సమయంలోనే నేతన్నల ఆకలి చావులు ఆపుటకు వారిలో ఆత్మస్థైర్యం కల్పించుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు అప్పుడే ప్రణాళికలు తయారు చేశారని తెలిపారు . తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు నూలు కొనుగోలుపై సబ్సిడీ, పవర్ సబ్సిడీ , ఇతర అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని తద్వారా చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఆగిపోయాయని అన్నారు. చేనేత కార్మికులలో ఆత్మస్థైర్యం కలిగిందని తెలిపారు .చేనేత కార్మికులకు ఉపాధి కల్పించుటకు చేనేత ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని అన్నారు. దసరా ,రంజాన్ , క్రిస్టమస్ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం చేనేత వస్త్రాలను కొనుగోలు చేసి 50 లక్షల మంది పేద ప్రజలకు కానుకలుగా అందిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు పెంపొందించాలని మంత్రి కోరారు.

రాష్ట్ర పౌర సరఫరాలు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు . నేత కార్మికుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేనేత బీమా పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు . భారతదేశంలో అత్యధిక చేనేత కార్మికులు కరీంనగర్ జిల్లాలోనే ఉన్నారని మంత్రి తెలిపారు .చేనేత కార్మికులలో గొప్ప నైపుణ్యం ఉందని , నేతన్నలు మగ్గం పై ఏక కాలంలో తన ప్రతి అవయవం పని చేస్తేనే ఒక చీరే, ఒక ఒక దోతి తయారవుతుందని అన్నారు . తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నేతన్నల ఆత్మహత్యలు జరిగేవని రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలతో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయని తెలిపారు . ప్రభుత్వం ట్రిప్ టు ఫండ్ కింద నిధులు విడుదల చేసిందని తెలిపారు. చేనేత కార్మికులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు . కరీంనగర్ లో ఒక ఎకరం స్థలంలో నేతన్న భవనం నిర్వహిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

జిల్లా కలెక్టర్ ఆర్వి కర్ణన్ మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేనేత మిత్ర పథకం, నూలు కొనుగోలుపై సబ్సిడీ, నేత బజార్ వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని అన్నారు .నేత కార్మికులను ప్రోత్సహించుట కు ప్రతి ఒక్కరూ వారానికి ఒక రోజు చేనేత వస్త్రాలు ధరించాలని కలెక్టర్ కోరారు.

అనంతరం 19 చేనేత సహకార సంఘాలకు 81 లక్షలు, 17.71 లక్షల పావలా వడ్డీ రుణాల చెక్కు లను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి, రాష్ట్ర పౌరసరఫరాలు బిసి సంక్షేమ శాఖ మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు

 

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ , నగర మేయర్ వై .సునీల్ రావు, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు జి .సంపత్ , కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు , పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షులు మెతుకు సత్యం, గౌరవ అధ్యక్షులు వాసాల రమేష్, చేనేత సహకార సంఘాల అధ్యక్షులు సభ్యులు సత్యనారాయణ చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు

 

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post