DPRO KMNR తేది : 07-09-2021 : ఫోటోలు & press note : అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు పై జిల్లా స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస గరిమ అగర్వాల్.( కరీంనగర్ జిల్లా)

పత్రికా ప్రకటన
తేదీ:7-9-2021

కరీంనగర్

అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రగతి సమాచారం అందించాలి:

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
-000-

జిల్లాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయుచున్న వివిధ రకాల అభివృద్ది, సంక్షేమ పథకాల సూచిక ప్రగతి సమాచారం ఎప్పటికప్పుడు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల 10 వ తేదీలోపు శాఖల నివేదికలను పొందుపర్చిన నమూనాల సమాచారాన్ని సమర్పించాలని తెలిపారు. సంక్షేమ పథకాల ప్రగతిని అంచనా వేసెందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి నెల రెండవ, నాల్గవ సోమవారం సంబంధిత శాఖలతో జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహిస్తామని కలెక్టర్ తెలిపారు. ప్రతి నెల 10 వ తేదీలోగా వివిధ శాఖల నివేదిక, సూచికలను వెబ్ పోర్టల్ నందు అప్ లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి శాఖ నుండి సమాచారాన్ని మండలాల వారీగా సేకరించి తగిన సమయంలో సమాచారాన్ని వెబ్ పోర్టల్ నందు అప్ లోడ్ చేయుటకు ఒక అధికారిని ఇన్ చార్జీగా నియమించి శాఖకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్య ప్రణాళికాధికారి ద్వారా పంపించాలని ఆదేశించారు. ఆరోగ్యం, పౌష్టికాహారం, విద్య, వ్యవసాయం, నైపుణ్యాభివృద్ధి, కనీస మౌళిక వసతులు, తదితర అంశాల పై ముఖ్య ప్రణాళిక అధికారి దృశ్య మాద్యం ద్వారా వివిధ శాఖల అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లా స్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు.

ఈ సమీక్షా సమావేశములో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమా అగర్వాల్ , ముఖ్య ప్రణాళికాధికారి శ్రీ. డి. కొమురయ్య, జిల్లా వైద్యాదికారి డాక్టర్.జువెరియా, డి.ఆర్.డి.ఓ శ్రీలత రెడ్డి, డి.పి.ఆర్. ఇ ఆర్. శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post