DPRO KMNR తేది : 07-09-2021 : ఫోటోలు & PRESS NOTE : కరీంనగర్ టు సిరిసిల్ల పద్మనాగర్ లో వర్షాలతో దెబ్బతిన్న రోడ్డును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, మున్సిపల్ కమిషనర్ గరిమ అగర్వాల్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ:7-9-2021

రోడ్లపై ఉన్న వర్షపు నీటిని తొలగించండి

పద్మనగర్ వద్ద నిలిచిన వర్షపు నీటిని తాత్కాలిక నాలాలు నిర్మించి నీటిని తొలగించాలి

జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్
000000

ప్రజా రవాణా సౌకర్యానికి అడ్డంకిగా మారిన వర్షపు నీటిని తాత్కాలిక నాలాలు నిర్మించి వర్షపు నీటిని తొలగించి ప్రజా రవాణ ను మెరుగుపరచాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్ ఆర్ అండ్ బి, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి నగర శివారు పద్మా నగర్ వద్ద వర్షపు నీటీతో చెరువులా మారి, ప్రజా రవాణా రాకపోకలకు అడ్డంకిగా మారడంతో మంగళవారం కలెక్టర్ నగరపాలక సంస్థ కమిషనర్ గరిమ అగర్వాల్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిలిచిన వర్షపు నీటినీ తొలగించేందుకు ప్రధాన రహదారికి రెండు వైపులా నాలాలూ నిర్మించాలని అధికారులను ఆదేశించారు. రవాణా సౌకర్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని తెలిపారు.మోకాలు లోతుకు పైగా నిలిచిన వర్షపు నీరు తొలగించెంతవరకు రాకపోకలను నియంత్రించాలని తెలిపారు. అనంతరం ఎల్ ఎం డి నుండి నీరు విడుదల అవుతున్న నీటి ప్రవాహ వేగాన్ని పరిశీలించారు.ఎన్ని క్యూసెక్కుల నీరు డ్యామ్ నుండి విడుదల చేస్తున్నారని ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బి ఈఈ మునిసిపల్ ఎస్ఈ కృష్ణారావు, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చే జారీ చేయనైనది

Share This Post