DPRO KMNR తేది : 07-09-2021 : PHOTS & PRESS NOTE : వినాయక చవితి ఏర్పాట్ల పై సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ పాల్గొన్న పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

తేదీ 07-09- 2021

శాంతియుతంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి

జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
o0o
వినాయక చవితి పండుగ సందర్భంగా జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ .వి కర్ణన్ అన్నారు .

మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై జిల్లా అధికారులు, శాంతి కమిటీలతో కలెక్టర్, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా గణేష్ ఉత్సవాలను భక్తిశ్రద్ధల తో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. ప్రతి గణేష్ మండపంలో ప్రసాదంతో పాటు మాస్క్ ను భక్తులకు అందజేయాలని కలెక్టర్ సూచించారు . భక్తులు అందరూ మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని అన్నారు .గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, శాంతి కమిటీల సభ్యులు అందరూ మట్టి గణపతి విగ్రహాలను ప్రోత్సహించాలని అన్నారు. గణేష్ మండపాలలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు . ప్రతి గణేష్ మండపానికి ఒక ఇన్చార్జిని నియమించాలని సూచించారు. గణేష్ నిమజ్జనం జిల్లాలో మానకొండూర్, చింతకుంట , కొత్తపల్లి లలో నిమజ్జన పాయింట్లను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు . ప్రతి నిమజ్జన స్థలాలలో లైటింగ్, బ్యారికేడ్ లను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు .జిల్లాలో ఇటీవల భారీ వర్షాలకు అన్ని చెరువులు, కుంటలు నీటితో నిండాయని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిమజ్జన పాయింట్ లో గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని మత్స్య శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు . అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని జిల్లా అగ్ని మపక అధికారిని ఆదేశించారు.

పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కరీంనగర్ లో గణేష్ ఉత్సవాలను పెద్ద ఎత్తున భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అని అన్నారు. గణేష్ మండపాలలో భక్తులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని, ప్రతి ఒక్కరు మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. పెద్ద గణేష్ మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సిపి సూచించారు .గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు నీటిలో పడిపోకుండా జాగ్రత్త వహించాలని అన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్, గరిమ అగర్వాల్ ,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జు వేరియా, ఎక్సైజ్ సూపరిండెంట్ చంద్రశేఖర్ , జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న, మత్స్య శాఖ ఏడి రాజ నరసయ్య, ఇతర జిల్లా అధికారులు శాంతి కమిటీల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post