DPRO KMNR తేది : 09-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : కలెక్టరేటు లో జరిగిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో మాట్లాడుచున్న జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేది:09 -08-2021

డయల్ యువర్ కలెక్టర్ సమస్యలను పెండింగ్ లేకుండా త్వరగా పరిష్కరించాలి:
అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్:
-000-
ప్రతి సోమవారం నిర్వహించు డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో ప్రజల నుండి అందిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి రాలేని ప్రజల సమస్యల పరిష్కారానికే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమానికి వచ్చిన ప్రజా సమస్యలు పెండింగులో లేకుండా త్వరగా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
జమ్మికుంట మండలం గన్నేరువరం నుండి రవీందర్ మాట్లాడుతూ వడ్లు అమ్మేటప్పుడు జోకేటప్పుడు అవకతవకలు జరిగినాయని, ఎలాంటి రశీదు ఇవ్వలేదని సరియైన రేటు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని ఆయన తెలిపారు. వచ్చునూరు నుండి కర్ణాకర్ మాట్లాడుతూ స్మశాన వాటికకు కేటాయించిన స్థలంలో గడ్డివాములు పెట్టుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని ఆయన అన్నారు. వీణవంక మండలం రెడ్డిపల్లి నుండి శ్రీధర్ మాట్లాడుతూ దళిత వాడకు సంబంధించిన 45 ఫీట్ల రోడ్డు మరమ్మత్తు కొరకు ఎం.పి గారు నిధులు కేటాయించినారు. ఇంతవరకు మాకు ఎలాంటి ప్రోసిడింగ్ రాలేదని ఫిర్యాదు చేసినారు. పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. కరీంనగర్ మండలం పకీర్ పేట గ్రామం నుండి సంధ్య మాట్లాడుతూ మున్సిపల్ సెటర్లు ఇదివరకు టెండర్ పెట్టారు. ఇప్పుడు ఖాళీగా ఉన్నాయి, మళ్ళి టెండర్ పెడతారా, పెట్టకపోతే నాకు తెలపాలని నేను సెటర్లో జీరాక్స్ సెంటర్ పెట్టుకుంటానని ఆయన తెలిపారు. జమ్మికుంట మండలం నుండి అంకుసాపూర్ గ్రామం నుండి రామారావు మాట్లాడుతూ మా నాన్న పేరు మీద ఎకరం భూమి ఉన్నది అతడు చనిపోయాడు మా అమ్మ పేరు మీద కావాలని మీ-సేవాలో ధరఖాస్తు చేసుకున్నాను, ధరణిలో నమోదు కాలేదని పాసు పుస్తకం రాలేదని ఫిర్యాదు చేశారు. ఎం.ఆర్.వో. పరిశీలించిన వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమా అగర్వాల్, జడ్పీసిఈవో ప్రియాంక, ఆర్.డి.వో. ఆనంద్ కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, డి.ఆర్.డి.వో. శ్రీలత రెడ్డి, డిఎస్..ఓ. సురేష్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మార్కెటింగ్ డి.డి. పద్మావతి, జిల్లా వైద్యాధికారి డా. జువేరియా, పశు వైద్య అధికారి నరెందర్, వ్యవసాయాధికారి శ్రీదర్, వెనుకబడిన తరగతుల అధికారి రాజ మనోహర్, డి.పి.వో. వీర బుచ్చయ్య, ఎల్.డి.ఎం. లక్ష్మణ్, ఉప కార్యా నిర్వాహక సమాచార ఇంజనీర్ సి.హెచ్. కొండయ్య, కలెక్టరేట్ ఏ.వో. లక్ష్మా రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చేజారీచేయనైనది

Share This Post