DPRO KMNR తేది : 09-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : కలెక్టరేటు ఆడిటోరియం లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజా పిర్యాదులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేది:09-08-2021
కరీంనగర్
ప్రజావాణికి 94 ధరఖాస్తులు
-000-
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన 94 మంది దరఖాస్తు చేసుకున్నారని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.
సోమవారం కలెక్టరేట్ లోని ఆడిటోరియంలో కరోనా నిబంధనల ప్రకారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజల సమస్యలకు సంబంధించిన 94 ధరఖాస్తులు అందాయని, ఈ సందర్భంగా ప్రజల నుండి అందిన ధరఖాస్తులను పరిష్కరించుటకు వెంటనే సంబంధిత శాఖలకు పంపినట్లు తెలిపారు. ఇందులో 57 రెవెన్యూకు సంబంధించినవి , 02 మున్సిపాలిటీ కి చెందినవి, 19 ఇతర శాఖలకు సంబంధించినవని అయన తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజావాణిలో వచ్చిన ధరఖాస్తులను ప్రాధాన్యతతో వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ గరీమా అగర్వాల్, జడ్పీసిఈవో ప్రియాంక, ఆర్.డి.వో. ఆనంద్ కుమార్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, డి.ఆర్.డి.వో. శ్రీలత రెడ్డి, డిఎస్..ఓ. సురేష్ రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్, మార్కెటింగ్ డి.డి. పద్మావతి, జిల్లా వైద్యాధికారి డా. జువేరియా, పశు వైద్య అధికారి నరెందర్, వ్యవసాయాధికారి శ్రీదర్, వెనుకబడిన తరగతుల అధికారి రాజ మనోహర్, డి.పి.వో. వీర బుచ్చయ్య, ఎల్.డి.ఎం. లక్ష్మణ్, ఉప కార్యా నిర్వాహక సమాచార ఇంజనీర్ సి.హెచ్. కొండయ్య, కలెక్టరేట్ ఏ.వో. లక్ష్మా రెడ్డి, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం కరీంనగర్ చేజారీచేయనైనది

Share This Post