DPRO KMNR తేది : 09-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రచురణ

తేది: 09.08.2021.

ఆగస్టు 12న న్యూమోకాకల్ కాంజుగెట్ వ్యాక్సినేషన్ (పిసివి) కార్యక్రమం ప్రారంభం

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

00000

జిల్లాలో ఆగస్టు 12న న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభించబడుతుందని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో న్యూమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్ ప్రారంభం పై జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ న్యూ మేకాకల్ న్యూమోనియా అనేది పిల్లలలో ఊపిరితిత్తులకు సంక్రమించే వ్యాధి అని అన్నారు. ఈ వ్యాధి 0 నుండి ఒక సంవత్సరం లోపు పిల్లలకు శ్వాసకోశ సంబంధ వ్యాధి అని 5 సంవత్సరాల లోపు పిల్లల్లో లక్ష మందిలో 50 మంది పిల్లలు ఈ వ్యాధి తో చనిపోతున్నారు అని తెలిపారు. ఈ వ్యాధి నివారణకు వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నరని కలెక్టర్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా వ్యాధిని నివారించవచ్చని తెలిపారు . వ్యాక్సినేషన్ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.

జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ జూవేరియా వ్యాక్సినేషన్ కార్యక్రమం గురించి వివరించారు .జిల్లాలో కొత్తగా 0-01 సంవత్సరాల లోపు పిల్లలకి న్యూమోకాకల్ కాంజుగెట్ బాక్టీరియా ద్వారా వచ్చే శ్వాసకోశ వ్యాధి అని ఇది తుంపర్ల ద్వారా (దగ్గు లేదా తుమ్మి నప్పుడు) ఒకరి నుండి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందుతుంది అన్నారు .వ్యాధి యొక్క నివారణ , తీవ్రతను తగ్గించడానికి వ్యాక్సినేషన్ తప్పని సరి అని అన్నారు .ఈ వ్యాక్సిన్ ను మొదటి డోసు 06 వారాలు, రెండవ డోసు 14 వారాలు , మూడవ డోసు 09 నెలల లోపు, సార్వత్రిక వ్యాధి నిరోధక కార్యక్రమములో బాగంగా పిల్లలకు వేయించాలి అని తెలిపారు .ఈ వ్యాక్సిన్ కార్యక్రమం విజయవంతం చేయుటకు మెప్మా , అంగన్వాడీ సిబ్బంది సేవలు ఉపయోగించుకొని అర్హులైన పిల్లలకు 100% వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. ఈ న్యూమోకాకల్ కాంజుగెట్ వ్యాక్సిన్ జిల్లాలో 12 ఆగష్ట్ 2021 రోజున ప్రారంభించబడుతుంది అని తెలిపారు.

ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ గరీమా అగర్వాల్, శ్యామ్ ప్రసాద్ లాల్,జెడ్పి సి.ఇ.ఓ. ప్రియాంక, డి. ఐ. ఓ డాక్టర్ సాజిదా, WHO కన్సల్టెంట్ డా. అతుల్ నిగమే, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post