DPRO KMNR తేది : 09-08-2021 : press note & photos :దళిత బంధు కు 500కోట్లు నిధులు మంజూరు చేసిన సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, పాల్గొన్న రాష్ట్ర AC కార్పొరేషన్ చేర్మెన్ బ బండ శ్రీనివాస్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్. (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన తేదీ :09-08 -2021
కరీంనగర్

దళితబంధు పథకానికి 500 కోట్ల నిధులు మంజూరు

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపిన రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ దళిత బంధు రిసోర్స్ పర్సన్లు

00000

దళితబంధు పథకం అమలుకు 500 కోట్లు నిధులు ప్రభుత్వం మంజూరు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.

సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబంధు పథకం అమలుపై జిల్లాఅధికారులు, మండల ప్రత్యేక అధికారులు, దళిత బంధు మండల రిసోర్స్ పర్సన్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి అమలు చేయుటకు మొదటి విడుతగా రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లు నిధులు విడుదల చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఆగష్టు 16న దళిత బంధు పథకాన్ని హుజురాబాద్ నియోజకవర్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. దళిత బంధు పథకం సాచులేషన్ పద్ధతిన అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మంజూరు చేయబడుతుందని కలెక్టర్ తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గం లో దళిత బంధు పథకం మొదటి విడుతలో 5,000 మంది అర్హులైన దళిత కుటుంబాలకు 10 లక్షల చొప్పున అందించబడుతుందని కలెక్టర్ తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 16 న హుజురాబాద్ లో దళిత బంధు పథకం ప్రారంభ కార్యక్రమానికి లబ్ధిదారులను తీసుకువచ్చుటకు 825 బస్సులు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. ప్రతి మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించామని, ప్రతి బస్సుకు ఒక రిసోర్స్ పర్సన్ ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. దళిత బంధు కార్యక్రమం విజయవంతం చేయుటకు అందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు పథకం అమలుకు మొదటి విడుతలో 500 కోట్లు నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ దళిత బంధు మండల రిసోర్స్ పర్సన్లు కేక్ కట్ చేసి సంబురాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండా శ్రీనివాస్ మాట్లాడుతూ దళిత బంధు పథకం అర్హులైన ప్రతి ఒక్కరికి వంద శాతం ప్రభుత్వం అమలు చేస్తుందని తెలిపారు. మొదటి విడుతలో 5 వేల మందికి దళిత బంధు పథకం క్రింద 10 లక్షల చొప్పున పంపిణీ చేయబడుతుందని తెలిపారు. మిగిలిన వారికి విడుతల వారిగా అందరికి దళిత బందు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, మండల ప్రత్యేక అధికారులు డి.ఆర్.డి.వో. శ్రీలత రెడ్డి, జిల్లా పరిశ్రమల కెంద్రం జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, జిల్లా పంచాయితీ అధికారి వీర బుచ్చయ్య, డి.సి.వో. శ్రీమాల, జిల్లా మార్కేటింగ్ ఆఫీసర్. పద్మావతి, జిల్లా విద్యాధికారి జనార్ధన్ రావు, ఎస్.ఈ. కార్పోరేషన్ ఈ.డి. మధుసుధన్ శర్మ, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి మధుసుధన్ , దళిత బంధు మండల రిసోర్స్ పర్సన్లు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి
కార్యాలయం కరీంనగర్ చేజారీచేయనైనది

Share This Post