DPRO KMNR తేది: 10-08-2021 : ప్రెస్ నోట్ & ఫోటోలు : హుజురాబాదు మండలం శాలపల్లి – ఇంద్రానగర్ గ్రామాలలో ఈ నెల 16 వ తేదీన ప్రారంభించనున్న దళిత బంధు కార్యక్రమనికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి పర్యటన స్థలాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్న సిపి సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్. ( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన

తేదీ 10-08 -2021

కరీంనగర్

ముఖ్యమంత్రి పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలి.

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్
0000

రాష్ట్ర ముఖ్యమంత్రి హుజురాబాద్ పర్యటనకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు .

మంగళవారం హుజురాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి పర్యటన సభ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తో కలిసి పరిశీలించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16న రాష్ట్ర ముఖ్య మంత్రి హుజురాబాద్ నియోజవర్గంలో దళిత బంధు పథకాన్ని ప్రారంభించుటకు వస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సభ డయాస్ నిర్మాణం, విఐపి గ్యాలరీ , ప్రెస్ గ్యాలరీ ,లబ్ధిదారుల గ్యాలరీలు, ప్రజల గ్యాలరీ లు వేర్వేరుగా బ్లాకుల వారీగా నిర్మించాలని ఆదేశించారు. సూచించిన ప్రకారము డయాస్ నిర్మాణం చేయాలని ఆదేశించారు. పకడ్బందీ బ్యారికేడింగ్ చేయాలని ఆదేశించారు. వర్షాకాలం అయినందున వాటర్ ప్రూఫ్ తో డయాస్, షామియానాలు ఏర్పాటు చేయాలని అన్నారు .ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడియా కు సపరేట్ గా గ్యాలరీ ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీ వాహనాల పార్కింగ్ సరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సభకు వచ్చే వాహనా లకు కేటాయించిన స్థలంలోనే పార్కింగ్ చేయుటకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు . సభకు లబ్ధిదారులను , ప్రజలను తీసుకువచ్చు వాహనాలు ,వారిని దింపి వెంటనే వాటికి కేటాయించిన పార్కింగ్ స్థలానికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అన్నారు

ఈ కార్యక్రమంలో పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ , షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారి నేతనియల్ , ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మధుసూదన శర్మ , జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య,మేనేజర్ నవీన్ కుమార్, హుజరాబాద్ ఆర్డిఓ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post