DPRO KMNR తేది : 10-08-2021 : ఫోటోలు & ప్రెస్ నోట్ : జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రారంభిస్తున్న నాబ్ స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్. (కరీంనగర్ జిల్లా).

పత్రిక ప్రకటన
తేది: 10-08-2021
కరీంనగర్.

చేనేత కళను ప్రోత్సహిద్దాం

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు
000000

చేనేత కళకు నైపుణ్యానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని చేనేత కళ అంతరించిపోకుండా ఉండేలా ప్రోత్సహించి బతికించుకోవడం అందరి బాధ్యత అని తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు అన్నారు.

చేనేత హస్తకళల వారోత్సవాల సందర్భంగా మంగళవారం స్థానిక రెవెన్యూ గార్డెన్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్తకళల ప్రదర్శనను ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. చేనేత కళాకారులకు జాతీయ హస్తకళల ప్రదర్శన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేత, జౌళి అభివృద్ధికి రూ 70 కోట్లు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేనేత కళాకారుల కళను, నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటే చెప్పాలనే ఉద్దేశంతో 1200 కోట్లు కేయించిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కులవృత్తులను ప్రోత్సహిస్తుందన్నారు. చేనేత కళాకారులకు ప్రోత్సాహాన్ని అందించేందుకు మంత్రి కేటీఆర్ సూచన మేరకు ప్రతి సోమవారం అందరూ చేనేత వస్త్రాలు ధరించాలని సూచించారు. లక్షలాదిమంది ఈ పరిశ్రమపై ఆధార పడ్డారని, వారి వస్తువులను కొనుగోలు చేసి వారికి చేయూత ఇవ్వాలని ఆయన కోరారు.

జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ మాట్లాడుతూ ఎంతో కష్టపడి పనిచేసే చేనేత కళాకారుల శ్రమను గుర్తించి వారిని ప్రోత్సహించాలని అన్నారు.వయో భేదం లేకుండా కష్టపడి పని చేస్తున్నారని వారి శ్రమను గుర్తించి, వారికి చేయూత నివ్వడానికి వారానికి ఒకసారైనా చేనేత వస్త్రాలు ధరించాలని కోరారు.
అదేవిధంగా కళాకారులు తయారు చేసిన వస్తువులపై వారి పేరు తయారీకి పట్టిన సమయాన్ని సూచించాలని ఉత్పత్తిదారులను సూచించారు.

నూతన ఒరవడితో ముందుకు వస్తున్న చేనేత వస్త్రాలను ఆదరించాలని నాబార్డ్ ఏజీఎం శ్వేతా మహంతి అన్నారు.

చేనేత హస్తకళ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన స్టాళ్లను, చేనేత ఉత్పత్తులు వారు పరిశీలించారు.

ఈకార్యక్రమం నాబార్డు అధికారులు మనోహర్ రెడ్డి, అనంత్, సహాయ సంచాలకులు చేనేత జౌళి శాఖ, వివిధ జిల్లాలకు చెందిన చేనేత కళాకారులు తదితరులు పాల్గొన్నారు.

సహాయ సంచాలకులు, జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, కరీంనగర్.

Share This Post