DPRO KMNR తేది: 11-08-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : వీణవంక మండల కేంద్రం లో సహకార సంఘాలకు వడ్డీలేని రుణాలు బ్యాంకు లింకేజి,శ్రీనిధి రుణాలను అందజేస్తున్న రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర AC కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, MLC లు నారదాసు లక్ష్మన్ రావు, పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్.( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన

తేదీ :11-08 -2021

కరీంనగర్

రాష్ట్రంలో త్వరలో 60 వేల ఉద్యోగాలు భర్తీ

రాష్ట్ర ఆర్థిక శాఖ మాత్యులు తన్నీరు హరిష్ రావు
0000

రాష్ట్రంలో వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 60 వేల ఉద్యోగాలను త్వరలో భర్తీ చేస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు అన్నారు.

బుధవారం వీణవంక మండల కేంద్రంలో స్వశక్తి సంఘాల మహిళలకు వడ్డిలేని రుణాలు బ్యాంక్ లింకేజీ, స్త్రీనిధి రుణాల పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక లక్ష 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని మంత్రి తెలిపారు. స్వశక్తి సంఘాల మహిళలు బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకోని ఆర్థికాభివృద్ధి సాధించాలని అన్నారు. వీనవంక మండలంలోని 24 గ్రామాలలో స్వశక్తి సంఘ భవనాల నిర్మాణానికి 4 కోట్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. సంబంధిత మంజూరు చెక్కులను స్వశక్తి సంఘాలకు మంత్రి అందజేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి బడ్జెట్ లో 10 వేల కోట్లు కేటాయించామని మంత్రి తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గానికి మంజూరై అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలను వెంటనే పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.పురిగుడిసెలు,పాత ఇండ్లు, రేకుల షెడ్డుల లలో స్వంత స్థలం ఉన్న అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఒక్కొక్క మంత్రికి 4 వేల డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణాలకు బడ్జెట్ కేటాయించామని తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో టి.ఎస్. ఐ -పాస్ ద్వారా 16 వేల పరిశ్రమలకు మంజూరు ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో ఆహార ఉత్పత్తుల పరిశ్రమల స్థాపనకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు. పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా పచ్చదనంతో ఉండాలనే లక్ష్యంతో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్, ట్రైలర్, ట్యాంకర్ ను మంజూరు చేశామని తెలిపారు. అన్ని గ్రామాలలో నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచుతున్నామని అన్నారు. ప్రతి గ్రామానికి వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులను, సెగ్రిగేషన్ షెడ్డులను మంజూరు చేశామని మంత్రి తెలిపారు. రైతు సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అన్నారు. రైతుల రుణా మాఫీ క్రింద 25 వేల రైతు రుణాలను మాఫీ చేశామని తెలిపారు. రైతు రుణ మాఫీ క్రింద 50 వేల లోపు రుణాలను ఆగష్టు 15 నుండి రైతు ఖాతాలలో జమ చేస్తామని మంత్రి పేర్కొన్నారు.ఇందు కోసం రెండు వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తస్మాన్నారు. 50 వేల నుండి లక్ష లోపు రుణాలను త్వరలో మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. కోవిడ్ కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు లేనందున రుణ మాఫీలో ఆలస్యం జరుగుతుందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా చెరువులు, కుంటలు నిండాయని అన్నారు. బీడు భూములన్ని సాగులోకి వచ్చాయని మంత్రి తెలిపారు. రైతుల సంక్షేమానికి రైతుబంధు, రైతుభీమా పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నామని అన్నారు. రైతులకు కావాల్సిన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచామని తెలిపారు. కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాల ద్వారా పేద ప్రజల ఆడ పిల్లల పెళ్లిళ్లకు అప్పుల పాలు కాకుండా 1,00,116/- రూ.ల ఆర్థిక సహయం అందిస్తున్నామని మంత్రి తెలిపారు. అభయ హస్తం లో డబ్బులను చెల్లించిన వారికి మిత్తితో సహా చెల్లించాలి అభయ హస్తం గ్రూపులోని సభ్యులకు ప్రతి నెల 2000 రూపాయలను పింఛన్ గా అందిస్తామన్నారు.

రాష్ట్ర పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు సాగు నీరు, త్రాగు నీరు, కరెంటు లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడే వారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు చేపట్టి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నారని మంత్రి తెలిపారు.

రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ రాష్ట్ర సర్వోతో ముఖాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో లక్ష మంది ఒంటరి మహిళలకు ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసిందని తెలిపారు. పేద వారి పెండ్లిలకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ వంటి పథకాలతో ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. పేద వారి పిల్లలకు కార్పోరేట్ పాఠశాలలకు ధీటుగా విద్యనందించుటకు గురుకులాలను ఏర్పాటు చేసిందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవించిన వారికి కెసిఆర్ కిట్లు అందజేస్తున్నారని అన్నారు. ప్రభుత్వ అసుపత్రులలో ఆపరేషన్లు లేకుండా ఎక్కువ సాధారణ ప్రసవాలే నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జడ్పీటిసీలు, ఎం.పి.పి.లు, డి.ఆర్.డి.వో. శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post