పత్రికా ప్రకటన
తేదీ 11-09 -2021
కరీంనగర్
దళిత బంధు లో డైయిరి యూనిట్స్ కు మొదటి ప్రాధాన్యం ఇచ్చి గ్రౌండింగ్ చేయాలి
నేటి వరకు 13,490 మందికి దళిత బంధు అకౌంట్ లలో డబ్బులు జమ చేశాం,మిగిలిన వారికి ప్రతి రోజు జమ చేస్తాం
జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
00000
దళిత బందు లో మొదటి ప్రాధాన్యత గా డైయిరి యూనిట్ల ను గ్రౌండింగ్ చేయాలనీ జిల్లా కలెక్టర్ ఆర్. వి.కర్ణన్ అధికారులను ఆదేశించారు
శనివారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో క్లస్టర్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు ఇతర అధికారులతో దళిత బంధు పథకం అమలుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుండి దళిత బందు పథకం లో డైయీరీ యూనిట్లకు మొదటి ప్రాధాన్యత గా గ్రౌండింగ్ చేయాలని అన్నారు. హుజూరా బాద్ నియోజకవర్గం లో దళిత బందు డబ్బులు ఇంత వరకు 13,490 మంది లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేశామని మిగిలిన దళిత బంధు లబ్ధిదారులకు ప్రతి రోజు డబ్బులు వారి అకౌంట్లో జమ చేస్తామని తెలిపారు. దళిత బంధు పథకంలో పాడి గేదెల( డైయిరి ) యూనిట్లు ఎన్నుకున్న లబ్ధిదారులకు వెంటనే గ్రౌండింగ్ చేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ లోకల్ బాడి గరిమ అగర్వాల్ , అసిస్టెంట్ కలెక్టర్ మయాంక్ మిట్టల్, జిల్లా పరిషత్ సీఈఓ ప్రియాంక, క్లస్టర్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్ లు, ఎంపీవోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు
సహాయ సంచాలకులు జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం చే కరీంనగర్ జారీ చేయడమైనది