DPRO KMNR తేది: 12-08-2021 : ఫొటోలు & ప్రెస్ నోట్ : హుజురాబాద్ మండలం శాలపల్లి – ఇంద్రానగర్ గ్రామాలలో ఈ నెల 16 వ తేదీన ప్రారంభించనున్న దళిత బంధు కార్యక్రమనికి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పర్యటించనున్న స్థలాన్ని పరిశీలించిన రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు పాల్గొన్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర పౌర సరఫరాలు, బిసి సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర SC కార్పొరేషన్ చైర్మెన్ బండ శ్రీనివాస్, MLC పాడి కౌశిక్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్,సీపీ సత్యనారాయణ, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్. ( కరీంనగర్ జిల్లా ).

పత్రికా ప్రకటన తేదీ :12-08 -2021
కరీంనగర్

ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు

-000-

ఆగష్టు 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి హుజురాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరిష్ రావు అన్నారు.

గురువారం హుజురాబాద్ మండలంలోని శాలపల్లి గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొను సభ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం దినేష్ ఫంక్షన్ హాల్ లో మంత్రులు, జిల్లా అధికారులతో సభ ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సభలో 10 బ్లాకులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. 5 బ్లాకులు మహిళలకు కేటాయించాలని సూచించారు. 5 బ్లాకులు ప్రజా ప్రతినిధులకు, ప్రజలకు కేటాయించాలని అన్నారు. వి.ఐ.పి. లకు, ప్రెస్ కు వేరు వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. సభకు సంబంధించి డయాస్ ను పకడ్బందీగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు. మెయిన్ డయాస్ ప్రక్కన కళాకారులకు డయాస్ ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని ట్రాన్స్ కో ఎస్.ఈ. ని మంత్రి ఆదేశించారు. స్టాండ్ బై గా పెద్ద జనరేటర్ ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి సభకు లబ్ధిదారులను తీసుకువచ్చుటకు 825 బస్సులను ఏర్పాటు చేశారని, ప్రతి బస్సుకు ఒక ఇన్ చార్జీ అధికారిని నియమించాలని ఆదేశించారు. లబ్దిదారులకు ఆహార ప్యాకెట్లు బస్సుల్లోనే పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సభా ప్రాంగణంలోకి వెళ్లు బ్లాక్ ల గేట్ల వద్ద ఏ.ఎన్.ఎం. లను ఏర్పాటు చేయాలని మంత్రి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారిని సూచించారు. ప్రతి ఒక్కరు సభా ప్రాంగణంలోకి మాస్కులు ధరించి వెళ్లెల చూడాలని మాస్కులు లేని వారికి ఏ.ఎన్.ఎం. లు మాస్కులు అందజేయాలని మంత్రి అన్నారు. డయాస్ ఇన్ చార్జీగా ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ ను, జిల్లా వ్యవసాయ అధికారి నియమించామని తెలిపారు. డయాస్ పై ప్రోటోకాల్ ప్రకారం మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు, జడ్పీ చైర్మన్, హుజురాబాద్ నియోజకవర్గంలోని మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ కమిటి చైర్మన్లు, ఎం.పి.పి.లు, జడ్పీటిసిలు ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బస్సులను 500 మీటర్ల దూరంలోనే నిలిపి లబ్ధిదారులను పంపించాలని అన్నారు. సి.ఎం. పర్యటన సందర్భంగా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి పోలీస్ కమీషనర్ కు సూచించారు. సభా ప్రాంగణం వద్ద మహిళల బ్లాక్ ల వద్ద మహిళా పోలీసులను ఇతర బ్లాక్ ల వద్ద పురుష పోలీసులను ఏర్పాటు చేసి క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపించాలని పోలీస్ కమీషనర్ కి సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నామని మంత్రి తెలిపారు.

ఈ సమావేశంలో రాష్ట్ర పౌర సరఫరాలు, బి.సి. సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

జారీ చేసిన వారు సహాయ సంచాలకులు, సమాచార పౌర సంబంధాల శాఖ కరీంనగర్

Share This Post